డ్రగ్స్ మాఫియా ఉచ్చులో తెలంగాణ ఎమ్మెల్యేలు

డ్రగ్స్ మాఫియా ఉచ్చులో తెలంగాణ ఎమ్మెల్యేలు

డ్రగ్స్ మాఫియా ఉచ్చులో తెలంగాణ ఎమ్మెల్యేలు

బెంగళూరు కన్నడ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు లింక్స్ తెలంగాణకు పాకింది. నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ డ్రగ్స్ కేసు సినీ ఇండస్ట్రీని ఏ విధంగా కుదిపేసిందో చూశాం. ఇప్పుడు అదే డ్రగ్స్.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బెంగళూరులో తీగ లాగితే తెలంగాణ ప్రభుత్వంలో డొంక కదిలింది.

కన్నడ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ ఫైనాన్షియర్స్ గా ఉన్నారు సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డి. వీళ్లిద్దరూ కన్నడ సినిమాలకు ఫైనాన్స్ చేస్తుంటారు. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలతోపాటు పబ్స్, హోటల్స్ నిర్వహిస్తూ ఉంటారు సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డి. ఈ క్రమంలోనే వీరికి డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులతో పరిచయం అయ్యింది. ఇటీవల బెంగళూరులో కొకైనా విక్రయిస్తూ నైజీరియన్లు అరెస్ట్ అయ్యారు. వారిని విచారించగా.. సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డిలకు డ్రగ్స్ అమ్మినట్లు ఒప్పుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా పెద్ద మొత్తం డ్రగ్స్, గంజాయి, కొనైన్ ను సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డి కొనుగోలు చేసినట్లు చెప్పారు నైజీరియన్లు.

ఈ సమాచారం ఆధారంగా సందీప్ రెడ్డిని అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు.. కీలక సమాచారం రాబట్టారు. తన పబ్స్, హోటల్స్ లో వ్యాపారవేత్తలు, రాజకీయ నాయలకులకు తరచూ పార్టీలు ఇస్తూ ఉండేవాడినని.. ఆ పార్టీల్లో కొకైన్, గంజాయి లాంటి డ్రగ్స్ వినియోగించేవారం అని వెల్లడించారు. సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డి పార్టీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యేవారని.. అదే విధంగా హైదరాబాద్ లో ఇచ్చిన పార్టీలకు సైతం ఈ ఎమ్మెల్యేలు తరచూ హాజరయ్యే వారని వివరించాడు సందీప్ రెడ్డి.

సందీప్ రెడ్డి విచారణలో భయంకరమైన విషయాలు ఏంటంటే.. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఓ ఎమ్మెల్యే అయితే తరచూ కొకైన్ తీసుకెళ్లేవాడంట. నలుగురు ఎమ్మెల్యేలతోపాటు కొంత మంది పారిశ్రామికవేత్తలు సైతం వీరిద్దరు ఇచ్చే పార్టీల్లో తైతక్కలాడేవారని.. పార్టీ అంటే ఇలా ఉండాంటూ పొగడ్తల వర్షం కురిపించేవారంట. అంతే కాదు.. వారానికి ఒకసారి ఫోన్ చేసి ఏం రెడ్డీ.. పార్టీ ఎప్పుడిస్తున్నావ్ అంటూ అడిగేవారంట.

సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డి ఇచ్చే పార్టీలకు అటెండ్ అయిన ఆ నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు ఎవరు అనేది ఇప్పడు హాట్ టాపిక్ అయ్యింది. త్వరలోనే బెంగళూరు పోలీసులు ఈ నలుగురు ఎమ్మెల్యేలను విచారించనున్నట్లు తెలుస్తోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు