నాగార్జునసాగర్ బరిలో 41 మంది – గెలుపెవరిది

నాగార్జునసాగర్ బరిలో 41 మంది - గెలుపెవరిది

తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్ అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికలో నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. ఏప్రిల్ 3వ తేదీ నాటికి 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 19 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించటం లేదా ఉప సంహరించుకోవటం జరిగింది. ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ ఉండనుంది.

టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భగత్ కుమార్ బరిలో ఉండగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి పోటీలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి రవికుమార్ పోటీలో ఉన్నారు. ఈ మూడు పార్టీ మధ్యే ప్రధానంగా ఫైటింగ్ జరుగుతుంది. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే.. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం.. సుదీర్ఘ మంత్రి పదవి అనుభవంతో.. మళ్లీ పట్టునిలబెట్టుకోవాలని సర్వ శక్తులు ఒడ్డుకున్నారు జానారెడ్డి.

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జోరు మీదున్న బీజేపీ.. నాగార్జునసాగర్ ఎన్నికను సీరియస్ గా తీసుకోవటం లేదు. తెలంగాణలోని ఓ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతుంటే.. బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్ ఏపీలోని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ప్రచారానికి వెళ్లారు. దీన్ని బట్టి.. నాగార్జునసాగర్ ఎన్నికను బీజేపీ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించటం లేదు.

నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ప్రచారం హోరాహోరీగా ఉంది. ఈ రెండు పార్టీ మధ్యే నున్వానేనా అన్నట్లు సాగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు అన్నీ.. జానారెడ్డికి అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. జానారెడ్డి మాత్రం 50 వేల మెజార్టీతో గెలుపొందుతానని ధీమాగా ఉన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.ఇక ఏప్రిల్ 16వ తేదీ ఇక్కడ పోలింగ్ జరగనుండగా.. మే 2వ తేదీన రిజల్ట్ రాబోతున్నది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు