భూమిపై నమోదవుతున్న సగం కరోనా కేసులు ఇండియాలోనే.. భయపడుతున్న మిగతా దేశాలు

covid cases in india onluy

భారతదేశంలో కరోనా కేసులు నమోదవుతున్న తీరు.. ప్రపంచం మొత్తాన్ని షాక్ కు గురి చేస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. డబ్ల్యూహెచ్ వో లెక్కలు చూస్తుంటే.. భారత్ కంటే.. మిగతా ప్రపంచ దేశాలు ఎక్కువ ఆందోళన చెందుతున్నాయి.

2021, మే 6వ తేదీ భూమిపై నమోదైన కొత్త కరోనా కేసులు 8 లక్షల 47 వేలు అయితే.. ఒక్క భారతదేశంలో నమోదైన కేసులే 4 లక్షల 14 వేలు ఉన్నాయి. ఇండియాను తీసేస్తే.. ప్రపంచంలోని మిగతా అన్ని దేశాల్లో నమోదవుతున్న కేసులు కేవలం 4 లక్షల 30వేలు మాత్రమే. ప్రపంచ దేశాలు ఇండియాను చూసి ఎందుకు భయపడుతున్నాయో ఇప్పుడు అర్థం అయ్యిందా…

రెండు వారాలుగా భారత్ లో కరోనా ఉధృతిని చూసి మిగతా ప్రపంచ దేశాలు అన్నీ ఆందోళన వ్యక్తం చేయటంతోపాటు.. పెద్ద ఎత్తున సాయం చేయటానికి ముందుకొస్తున్నాయి. అన్ని దేశాలు భారత్ పై రవాణా బ్యాన్ విధిస్తూ.. వైద్య సామాగ్రి, మందులు, ఆక్సిజన్, బెడ్స్, ఇతర సామాగ్రిని ప్రత్యేక విమానాల ద్వారా పంపిస్తూ.. భారత్ లో కరోనా కట్టడికి తమ వంతు సాయం అందిస్తున్నాయి.

ప్రపంచ దేశాలు ఎందుకు ఆందోళన పడుతున్నాయి.. ఎందుకు సాయం చేస్తున్నాయో భారత్ మినహా అన్ని దేశాలకు అర్థం అయినా.. మన బీజేపీ ప్రభుత్వానికి మాత్రం ఏ మాత్రం అర్థం అవుతున్నట్లు లేదు.. కరోనాను కట్టడి చేయకపోగా రాజకీయాలు చేస్తూ.. దాడులు చేస్తూ.. ఇష్యూను డైవర్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నాయి. జనం ప్రాణాల కంటే.. రాజకీయం గొప్పది అన్నట్లు డైవర్ట్ చేస్తూ.. అసలు విషయాన్ని మరుగున పరుస్తున్నాయి.

2021, మే 6వ తేదీ ఒక్క రోజే ఇండియాలో 4 లక్షల 14 వేల కొత్త కేసులు నమోదైతే.. 3 వేల 915 మంది చనిపోయారు. యాక్టివ్ కేసులు 36 లక్షల 45 వేల 164 ఉన్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు