ఏపీ పోలీసుల్లో కరోనా కలకలం – కనీసం ఐదువేల మందికి ఉండొచ్చని అనుమానం

ఏపీ పోలీసుల్లో కరోనా కలకలం - కనీసం ఐదువేల మందికి ఉండొచ్చని అనుమానం

ఏపీ పోలీసులు, స్పెషల్ బెటాలియన్ సిబ్బందికి కరోనా వెంటాడుతుంది. ఊహించని విధంగా పోలీస్ శాఖలో కరోనా విస్తరించటంపై ఏపీ పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. అందరికీ పరీక్షలు నిర్వహిస్తుంది. దీనికి కారణం ఎన్నికలు.

ఇటీవల తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు కోసం ఏపీ నుంచి స్పెషల్ బెటాలియన్ సిబ్బంది వేల సంఖ్యలో తరలివెళ్లారు. 20 రోజులు ఆ మూడు రోజుల్లో 3 వేల మందికి పైగా పోలీసులు విధులు నిర్వహించినట్లు సమాచారం. పోలింగ్ ముగిసిన వెంటనే.. వారందరూ ఏపీకి తిరిగి వచ్చారు. వీరిలో చాలా మంది ఇప్పుడు కరోనా బారిన పడుతున్నారు. వీరిలో 500 మందికి పైగా పోలీసులు ఇప్పుడు కరోనా బారిన పడినట్లు సమాచారం. వారి నుండి కనీసం ఐదువేల మందికి కరోనా వ్యాప్తి జరిగిఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

విషయాన్ని గుర్తించిన ఏపీ పోలీస్ శాఖ, ప్రభుత్వం వెంటనే పరీక్షలు నిర్వహిస్తుంది. స్పెషల్ బెటాలియన్ సిబ్బందితోపాటు.. ఆ మూడు రాష్ట్రాల్లో ఎన్నికల విధులకు వెళ్లిన వారు వెంటనే హోం ఐసోలేషన్ కావాలని.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తుంది. వారి కుటుంబ సభ్యులకు సైతం పరీక్షలు నిర్వహిస్తూ.. కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స అందిస్తుంది పోలీసు శాఖ.

దీనికితోడు ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. ఇటీవల పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్, జెడ్పీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి సైతం కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం.

శాంతి భద్రతలతోపాటు. రాబోయే రోజుల్లో కరోనాను ఎదుర్కోవటంలో.. కట్టడి చేయటంలో పోలీసుల పాత్ర విశేషంగా ఉంటుంది. ఈ క్రమంలోనే అందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు