సీఎం కేసీఆర్ చుట్టూ తొమ్మిది మంది డాక్టర్లు.. రెప్ప వేయకుండా కాపాడుతున్న బృందం

సీఎం కేసీఆర్ చుట్టూ తొమ్మిది మంది డాక్టర్లు.. రెప్ప వేయకుండా కాపాడుతున్న బృందం

సీఎం కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది.. ఎలా ట్రీట్ మెంట్ జరుగుతుంది అనే విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరికీ ఎంతో ఆసక్తి నెలకొంది. ఫాంహౌస్ లో చికిత్స పొందుతున్న సీఎం కేసీఆర్ ను నిరంతరం వైద్య పరీక్షలతోపాటు.. తొమ్మిది మంది డాక్టర్ల బృందం రెప్ప వేయకుండా కాపాడుతుంది.

ఏ మాత్రం చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు డాక్టర్లు. రాత్రి తీవ్రంగా ఉన్న జలుబు, దగ్గు నుంచి కొంచెం ఉపశమనం వచ్చినట్లు సమాచారం. తొమ్మిది మంది వైద్య బృందంలో.. పలమనాలజిస్ట్, కార్డియాలజిస్ట్ ఇలా.. అన్ని రకాలకు వైద్యం అందించగలిగిన స్పెషలిస్టులు ఉన్నారు. రాష్ట్ర సీఎం కావటంతో.. వైద్య ఆరోగ్య శాఖ నుంచి మరో బృందం కూడా ఆయనకు అందుతున్న వైద్యాన్ని నిరంతరం సమీక్ష చేస్తుంది.

అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి వైద్య సాయం అందించాలనే విషయంపైనా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు డాక్టర్లు. అత్యవసరం అయితే హైదరాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించటానికి అంబులెన్స్ లు సిద్ధంగా ఉంచటంతోపాటు.. అందులో అవసరం అయిన వైద్య పరికరాలు, మందులు సైతం రెడీగా ఉంచారు.

ఫాంహౌస్ లో ఉండి చికిత్స తీసుకుంటున్న సీఎం కేసీఆర్.. పూర్తిగా కోలుకుంటారని.. ఆస్పత్రి వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు డాక్టర్లు. అయినా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసున్నారు. తొమ్మిది మంది డాక్టర్లు.. 24 గంటలూ.. రెప్పవేయకుండా కాపాడుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు