స్మాకింగ్ సేవ్స్ .. ఇదెలా సాధ్యం అంటే ఈ వార్త చదవాల్సిందే

స్మాకింగ్ సేవ్స్ .. ఇదెలా సాధ్యం అంటే ఈ వార్త చదవాల్సిందే.. గ్రామాల్లో ఉదయం, సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి వేస్తారు కదా.. అలాంటిదే ఇది. చిన్న పిల్లలకు స్నానం చేసిన తర్వాత సాంబ్రాణి వేస్తారు కదా.. సేమ్ టూ సేమ్ అలాగే

#SmokingSaves
#SmokingSaves

స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం.. మీ గుండెకు చేటు.. ఊపిరితిత్తులను నాశనం చేస్తుంది.. స్మాకింగ్ మిమ్మల్ని చంపేస్తోంది.. ఇప్పటి వరకు వచ్చి ప్రకటనలు ఇవి.. ఇందుకు భిన్నంగా.. ఓ కార్పొరేట్ కంపెనీ ఐడియా ఇప్పుడు సంచలనంగా మారింది. స్మోకింగ్ సేవ్స్.. మంచి పొగ మీ జీవితాన్ని కాపాడుతుంది అంటూ హోరెత్తిస్తోంది. యాడ్స్ కుమ్మరిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే..

HMM ప్యూర్ పేరుతో.. మార్కెట్ లోకి ఓ పొడి వచ్చింది. ఈ పొడిని మీరు మండిస్తే పొగ వస్తుంది. ఆ పొగ పీల్చటం వల్ల చుట్టూ ఉన్న వాతావరణంలోని క్రిములు చచ్చిపోతాయి.. ఆ పొగ పీల్చటం వల్ల శరీరంలోని విష రసాయనాలు, క్రిములు చచ్చిపోయి ఆరోగ్యాన్ని ఇస్తోంది. హెచ్ఎంఎం ప్యూరీ పేరుతో దీన్ని పెద్ద ఎత్తున ఇండియాలో ప్రవేశపెట్టింది కంపెనీ.

హెచ్ఎంఎం ప్యూరీ ట్రయిల్ ప్యాక్ ధర ఎంతో తెలుసా.. అక్షరాల రూపాయి తక్కువ 20 వేల రూపాయలు. గ్రామాల్లో ఉదయం, సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి వేస్తారు కదా.. అలాంటిదే ఇది. చిన్న పిల్లలకు స్నానం చేసిన తర్వాత సాంబ్రాణి వేస్తారు కదా.. సేమ్ టూ సేమ్ అలాగే ఉపయోగించాలి ప్యూరీ ప్యాకెట్లను. ఈ పొడిన వేసుకోవటానికి ప్రత్యేకంగా ఓ స్టాండ్ ఇచ్చారు. ఇది హుక్కా స్టాండ్ మోడల్ లో ఉంది.

హెచ్ఎంఎం ప్యూరీ పొగను పీల్చటం శరీరంలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అని చెబుతోంది కంపెనీ. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్ ప్రచారం చేస్తుండటంతో.. చర్చనీయాంశం అయ్యింది. ప్యూరీ పొగ పీల్చటం వల్ల సిగరెట్, ఆల్కాహాల్ తాగే వారి అలవాటును సైతం మార్చుతుందంట. ఎన్నో పరిశోధనల తర్వాత ఈ విషయాన్ని నిర్థారించి.. మార్కెట్ లోకి విడుదల చేసినట్లు చెబుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు