ఆకాశం నీ హద్దురా మూవీ రివ్యూ : ఎయిర్ డెక్కన్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ గుర్తుకొస్తాయి

వాస్తవ కథే అయినా దాన్ని స్క్రీన్ మీదికి తీసుకురావడంలో చేసిన కృషి ఫలించింది అని చెప్పాలి.

సామాన్యుడికి విమాదం అనేది కల.. విమానం టికెట్ ధర అంటే అమ్మో అంటారు.. అలాంటి వారికి రూపాయికే విమానం టికెట్ అంటే ఎలా ఉంటుంది.. రైతులు కూడా విమానాన్ని బస్సు, రైలు ఎక్కినంత సులువుగా ఎక్కాలంటే ఏం చేయాలని.. ఇలాంటి ఆలోచనలతో.. దాన్ని నిరూపించి చూపించిన యువకుడి కలే ఆకాశం నీ హద్దురా మూవీ. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఈ సినిమా.. అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం..

2003లో ఓ విమానం ల్యాండ్ కాబోతుంటే.. ఆ విమానాన్ని అధికారులు అడ్డుకుంటారు. ల్యాండ్ అయ్యేందుకు అంగీకరించరు. సూర్య గొడవపడి విమానాన్ని ల్యాండ్ చేస్తారు.
ఎయిర్ డెక్కన్ ఎయిర్ లైన్స్.. విమాన రంగంలో సంచలనం. దాని యజమాని గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. వాస్తవ కథ అయినా.. దర్శకురాలు సుధ.. హీరో సూర్య ఎంతో శ్రద్ధగా తీసిన సినిమా ఇది. వారి పడిన కష్టం సినిమాలో అణువణువూ కనిపిస్తోంది.
ఫస్ట్ హాఫ్ కామెడీ, పాటతో సరదాగా గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ లో సూర్య కొత్త విమానయాన సంస్థను నెలకొల్పేందుకు చేసిన కృషిని చూపించారు.
ఓటీటీలో.. ఆన్ లైన్ ద్వారా చూడటం వల్ల సినిమా లెన్త్ ఎక్కువగా ఉంది అనే ఫీలింగ్ ఎవరికీ అనిపించదు. ఎందుకంటే మధ్యలో ప్రేక్షకులు తమకు తాము బ్రేక్ తీసుకుంటారు కాబట్టి.

హీరో సూర్య నట విశ్వరూపం ఆకాశం నీ హద్దురా సినిమాలో చూడొచ్చు అని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. సూర్య కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఒకటి ఈ మూవీ. భర్తను ప్రోత్సహించే పాత్రలో అపర్ణ నటన అద్భుతం.
భక్తవత్సలం నాయుడు పాత్రలో మోహన్ బాబు నటన మరోకోణంలో ఉంటుంది. సూర్య లక్ష్యాన్ని అడుగడుగునా అడ్డుకునే విలన్ పాత్రలో పరేష్ రావల్ మెప్పించాడు.
సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా సూట్ అయ్యాయి. ఎమోషన్స్ హైలెట్ అయ్యాయి. పాటలు మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తాయి.

నికేత్ బొమ్మి కెమెరా పనితనం సినిమాకు మరో ఎసెట్. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల విషయంలో సూర్య ఎక్కడా రాజీ పడలేదు.
దర్శకురాలు సుధ కొంగర.. ఎంచుకున్నది వాస్తవ కథే అయినా దాన్ని స్క్రీన్ మీదికి తీసుకురావడంలో చేసిన కృషి ఫలించింది అని చెప్పాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు