నిన్న దమ్మాలపాటి.. ఇవాళ ఏబీ వెంకటేశ్వరరావు – ఏపీ ప్రభుత్వానికి వరస విజయాలు

నిన్న దమ్మాలపాటి.. ఇవాళ ఏబీ వెంకటేశ్వరరావు - ఏపీ ప్రభుత్వానికి వరస విజయాలు.. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది జగన్ సర్కార్. సస్పెన్షన్ పై స్టేను ఎత్తివేస్తూ ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు.

ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లి విజయం సాధిస్తున్న కేసుల్లో.. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఊరట లభిస్తోంది. రెండు రోజుల్లో సీఎం జగన్ నిర్ణయాలను అనుకూలంగా తీర్పులు రావటం విశేషం. అమరావతి భూ కుంభకోణం, భూముల కొనుగోలు వ్యవహారంలో ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో దర్యాప్తుతోపాటు ఈ వార్తలను ప్రచురించొద్దు అని గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన ఏపీ హైకోర్టు. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు చేస్తే వచ్చే నష్టం, ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు సుప్రీంకోర్టు జస్టిస్. మీడియాపై గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం సరికాదని.. సహారా కేసులో మీడియాపై గ్యాగ్ ఆర్డర్ విషయంలో నిర్దిష్ట సూత్రాలు ఉన్నాయని వెల్లడిస్తూ.. ఎఫ్ఐఆర్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్.. రాజకీయ దురుద్దేశంతో సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొలిటికల్ లిటిగేషన్ వేస్తున్నారన్నారు.

దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో సుప్రీం తీర్పు అనుకూలంగా వచ్చిన 24 గంటల్లోనే మరో కేసులోనూ ఊరట లభించింది ఏపీ ప్రభుత్వానికి. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలపై ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం. దీనిపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. విచారణ తర్వాత స్టేను ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది జగన్ సర్కార్. సస్పెన్షన్ పై స్టేను ఎత్తివేస్తూ ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో డ్రోన్లు, సాంకేతిక పరికరాల కొనుగోలు చేశారు. ఇందులో అవినీతి జరిగిందని క్యాట్ కూడా స్పష్టం చేసింది.

రెండు రోజుల్లో రెండు కేసుల్లో హైకోర్టు తీర్పులను తప్పుబడుతూ.. హైకోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ.. సీఎం జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వటం విశేషం.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు