ఆచార్య షూటింగ్ ఆగలేదు.. చిరు లేకుండానే జరిగిపోతుంది

సెట్స్ లో డైరెక్టర్ కొరటాల శివ యూనిట్ సిబ్బందికి సూచనలు, సలహాలు

మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడటంతో.. ఆచార్య సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ అబద్ధం అని.. షూటింగ్ పున:ప్రారంభం అయ్యిందని చెబుతూ.. లొకేషన్ లోని ఫొటోలను విడుదల చేసింది యూనిట్. కట్ చేస్తే.. తాజాగా ‘ఆచార్య’ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.

కరోనా నుంచి రక్షణగా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరుపుతున్నామని.. ప్లాన్ ప్రకారం షెడ్యూల్‌ పూర్తి చేయడానికి టీం అంతా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది యూనిట్. సెట్స్ లో డైరెక్టర్ కొరటాల శివ యూనిట్ సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తున్న ఫొటోలను షేర్ చేసి.. యథావిథిగా పనులు జరుగుతున్నాయని.. ఏ పనీ ఆగలేదు అని స్పష్టం చేసింది యూనిట్.

చిరంజీవి లేని సన్నివేశాలు అన్నింటినీ చిత్రీకరించి.. మెగాస్టార్ ఎంట్రీ కాగానే.. మిగతా పార్ట్ కంప్లీట్ చేయటానికి నిర్ణయించుకుంది యూనిట్. చిరంజీవి కూడా త్వరలోనే కోలుకుని వస్తారని స్పష్టం చేసింది. అనుకున్నట్లుగానే షూటింగ్ పూర్తి చేసి.. రిలీజ్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు కొరటాల శివ.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు