బాలీవుడ్ నటుడు బాస్రా ఆత్మహత్య – సుశాంత్ తర్వాత – ధర్మశాలలో ఏం జరిగింది

ధర్మశాలలో ఆసిఫ్ బాస్రా ఎందుకు ఉంటున్నారు.. అతని కుటుంబ సభ్యులు ఆయనతో ఎందుకు లేరు.. ఆత్మహత్యకు

ప్రముఖ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు అయిన ఆసిఫ్ బాస్రా ఆత్మహత్య చేసుకోవటం హిందీ చిత్ర పరిశ్రమను షాక్ కు గురి చేసింది. 53 సంవత్సరాల బాస్రా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ధర్మశాలలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం అక్కడే ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయాడు.

ఆసిఫ్ బాస్రా.. ఏక్ విలన్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, క్రిష్ 3, జబ్ వి మెట్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సూర్య హీరోగా వచ్చిన సికిందర్ సినిమాలోనూ నటించారు. హాట్ స్టార్ లో విడుదలైన హోస్టెజెస్ వెబ్ సిరీస్ లో తనదైన స్టయిల్ లో నటించి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కెరీర్ పరంగా ఉన్నత స్థితిలోనే ఉన్న బాస్రా.. కొంత కాలంగా మానసిక ఒత్తిడితో ఉన్నట్లు చెబుతున్నారు సన్నిహితులు. ఆసిఫ్ మరణవార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న నటులు దర్శకులు నిర్మాతలు సంతాపం తెలియజేస్తున్నారు.

అద్భుతమైన నటుడు ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. మానసిక ఒత్తిడితోనే ఇటీవల సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది.. ఇప్పుడు మరో నటుడు కూడా అదే విధంగా ఆత్మహత్య చేసుకోవటం హిందీ చిత్ర పరిశ్రమను షాక్ కు గురి చేసింది.

ఈ మరణంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని ప్రకటించారు పోలీసులు. ధర్మశాలలో ఆసిఫ్ బాస్రా ఎందుకు ఉంటున్నారు.. అతని కుటుంబ సభ్యులు ఆయనతో ఎందుకు లేరు.. ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది అనే అంశాలు చర్చనీయాంశం అయ్యాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు