బీజేపీలోకి నటుడు రాజేంద్రప్రసాద్ – పార్టీ పదవి ఆఫర్ చేసిన వీర్రాజు

బీజేపీలోకి నటుడు రాజేంద్రప్రసాద్ - పార్టీ పదవి ఆఫర్ చేసిన వీర్రాజు... బీజేపీ పార్టీలోకి వస్తే పార్టీ పదవితో గుర్తింపు ఇవ్వటంతోపాటు అధికారంలోకి వస్తే హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారంట సోమువీర్రాజు. జాతీయ స్థాయిలో మోడీ

Actor Rajendra Prasad likely join BJP
Actor Rajendra Prasad likely join BJP

తెలంగాణలో ఊపు మీద ఉన్న బీజేపీ.. ఏపీలోని దూకుడు పెంచుతోంది. పార్టీకి నేతల కొరత ఉంది. అంతకు మించి గ్లామర్ సమస్య వెంటాడుతోంది. జనసేన పొత్తుతో ఉన్నా.. అది ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో చెప్పటం కష్టం. పవన్ కల్యాణ్ ను నమ్ముకుని ఉంటే కష్టం అని భావించి.. సినీ ఇండస్ట్రీపై దృష్టి పెట్టిన ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. నటుడు రాజేంద్రప్రసాద్ ను హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో భేటీ అయ్యారు.

సోమువీర్రాజుతోపాటు నటి హేమ ఆయన వెంట ఉన్నారు. రాజేంద్రప్రసాద్ తో గంటపాటు సాగిన సమావేశం.. కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. దేశంతోపాటు ఏపీలో రాజకీయ పరిణామాలను సుదీర్ఘంగా చర్చించిన తర్వాత పార్టీలోకి రావాలని ఆహ్వానించారంట. ఇప్పటి వరకు రాజేంద్రప్రసాద్ ఏ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు. రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ నటుడుగా కొనసాగుతున్నారు. పెద్దగా బిజీగా ఏమీ లేరు. ఈ క్రమంలోనే మిగతా జీవితాన్ని రాజకీయాల్లో గడపాలని చూస్తున్నారంట.

బీజేపీ పార్టీలోకి వస్తే పార్టీ పదవితో గుర్తింపు ఇవ్వటంతోపాటు అధికారంలోకి వస్తే హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారంట సోమువీర్రాజు. జాతీయ స్థాయిలో మోడీ ప్రభంజనం నడుస్తుందని.. ఏపీలో పార్టీకి మీలాంటి వారి సేవలు అవసరం అని కుండబద్దలు కొట్టారంట వీర్రాజు.

రాజేంద్రప్రసాద్ నో అని చెప్పలేదని.. ఆలోచించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు