అందరి కంటే ముందే వచ్చి తలుపులు తీస్తున్న హీరోయిన్..

అందరి కంటే ముందే వచ్చి తలుపులు తీస్తున్న హీరోయిన్..

అందరి కంటే ముందే వచ్చి తలుపులు తీస్తున్న హీరోయిన్..

ఆమె ఓ హీరోయిన్.. అల్లా టప్పా కాదులేండీ.. కొంచెం ఫేమస్ పర్సనాలిటీనే. చాలా అందంగా ఉంటుంది.. ఇటీవల వెబ్ సిరీస్ లో నటిస్తూ.. టాప్ యాక్టర్ గుర్తింపు కోసం పోటీ పడుతుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

ఈ బ్యూటీ పేరు ఊర్వశి రౌటేలా. లేటెస్ట్ గా ఇన్ స్పెక్టర్ అవినాష్ అనే భారీ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేస్తోంది. కెరీర్ పై బాగా శ్రద్ధ పెట్టిన ఈ అమ్మడు.. షూటింగ్ స్పాట్ కు అందరి కంటే ముందే వస్తుంది అంట. ఎంత ముందు అంటే.. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకే లోకేషన్ స్పాట్ కు వచ్చి.. మేకప్ మెన్, అసిస్టెంట్లను నిద్ర లేపుతుంది అంట. ఇటీవల తెల్లవారుజామున 4 గంటలకే వచ్చిన ఈ అమ్మడు.. తలుపులు కొడితే అర్థరాత్రి ఏంటీ అంటూ సిబ్బంది చిరాకుగా అన్నారంట. అర్థరాత్రి ఏంటీ.. నాలుగు అయితే అంటూ కస్సుబుస్సులాండింది అంట. హీరోయిన్ మాటలు విని షాక్ అయ్యారంట సిబ్బంది.

లోకేషన్ స్పాట్ కు తెల్లవారుజామునే వస్తున్న ఊర్వశి రౌటెలా.. నేరుగా మేకప్ గదిలోకి వెళ్లి తన అసిస్టెంట్లు వచ్చే వరకు స్క్రిప్ట్ చదువుకుంటూ.. యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉందంట.

ఆ తర్వాత వస్తున్న వాళ్లందరికీ లొకేషన్ లో తలుపులు తీస్తూ షాక్ పై షాకులు ఇస్తుందంట. ఇంత పొద్దున్నే ఎందుకు అంటే.. బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే చాలా బాగుటుందని.. యాక్టివ్ గా ఉంటాం అంటూ చిలక పలుకులు పలుకుతుంది అంట..

ఏమైనా కెరీర్ పై ఊశ్వరికి ఉన్న కమిట్ మెంట్ అలాంటిది మరీ అంటున్నారు…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు