ఒక్క రోజులో లక్ష కోట్లు లాస్.. ఆదాని పవర్ షేర్లు కొనే దిక్కు లేదు.. లబోదిబో అంటున్న ఇన్వెస్టర్లు

ఒక్క రోజులో లక్ష కోట్లు లాస్.. ఆదాని పవర్ షేర్లు కొనే దిక్కు లేదు.. లబోదిబో అంటున్న ఇన్వెస్టర్లు

ఒక్క రోజులో లక్ష కోట్లు లాస్.. ఆదాని పవర్ షేర్లు కొనే దిక్కు లేదు.. లబోదిబో అంటున్న ఇన్వెస్టర్లు

స్టాక్ మార్కెట్ మాయాజాలంలో మరోసారి సామాన్య ఇన్వెస్టర్లు దారుణంగా నష్టపోయారు. ముఖ్యంగా ఆదానీ పవర్ కంపెనీ షేర్లు కొనుగోలు చేసిన వాళ్లు లబోదిబో అంటున్నారు. 2021, జూన్ 14వ తేదీ ఒక్క రోజే స్టాక్ మార్కెట్ లో.. ఆదానీ షేర్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఒక్క ఆదానీ కంపెనీనే లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చింది.

రెండు నెలలుగా బీభత్సంగా పెరుగుతూ వస్తున్న ఆదానీ కంపెనీ షేర్లు.. సోమవారం దారుణంగా దెబ్బతిన్నాయి. ఆదానీ పవర్ షేర్ ఎనిమిది నష్టానికి పడిపోయింది. ఈ షేర్లకు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోగా.. 54 లక్షల షేర్లు అమ్మకానికి మార్కెట్ లో రెడీగా ఉన్నాయి. ఇక ఆదానీ పోర్ట్ షేర్ విలువ 125 రూపాయలు పడిపోయింది. ఆదానీ ఎంటర్ ప్రైజర్ షేర్ విలువ 200 నష్టపోయింది.

ఒక్క ఆదానీ గ్రూప్ షేర్లు మాత్రమే భారీగా పడిపోవటం.. కొనుగోళ్ల దారుల నుంచి మద్దతు లేకపోవటంతో.. పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు లక్ష కోట్ల రూపాయల విలువైన తమ సంపదను కోల్పోయారు.

కొన్ని రోజులుగా ఆదానీ పవర్ షేర్ భారీగా పెరుగుతుండటంతో.. ఎగబడి మరీ కొన్నారు. అనుకున్నట్లుగానే ర్యాలీ నడిచింది. శనివారం రోజు.. ఆదానీ కంపెనీకి చెందిన మూడు బ్యాంక్ అకౌంట్లను విదేశాల్లో ఫ్రీజ్ చేశారనే వార్త సర్క్యులేట్ కావటంతో.. ఒక్కసారిగా అమ్మకందారులు ఎగబడ్డారు. ఇదే సమయంలో కొనుగోళ్ల మద్దతు లభించకపోవటంతో.. లక్ష కోట్ల రూపాయల సంపద ఆవిరి అయ్యింది. అది కూడా ఒక్క ఆదానీ షేర్లు మాత్రమే కావటం విశేషం..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు