ఆదిలాబాద్ అడవుల్లో 1000 ఏళ్ల నాటి రాక్షస రాజుల ఆలయం

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్ మండలం గిమ్మా గ్రామ పరిథిలోని అడవుల్లో అత్యంత పురాతనమైన ఆలయ విశేషాలను చరిత్రకారులు కనుకొన్నారు.

ఆదిలాబాద్ అడవుల్లో 1000 ఏళ్ల నాటి రాక్షస రాజుల ఆలయం

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్ మండలం గిమ్మా గ్రామ పరిథిలోని అడవుల్లో అత్యంత పురాతనమైన ఆలయ విశేషాలను చరిత్రకారులు కనుకొన్నారు. స్థానికంగా ఉండే ప్రజలు చంద్రనారాయణ స్వామి ఆలయంగా పిలుచుకునే ఈ ఆలయాన్ని రాక్షస రాజులు నిర్మించి ఉంటారని చరిత్ర కారులు అంచనా వేస్తున్నారు.

నాగదేవత,గణపతి దేవుడి విగ్రహాలతో పాటు రాతితో చెక్కిన అనేక విగ్రహాలు ఈ ఆలయ పరిధిలో ఉన్నాయి.అయితే ఆలయ ముఖద్వారం తూర్పువైపు కాకుండా,పడమరవైపు నిర్మించి ఉంది. ఆలయనిర్మాణం అనేక కారణాల వల్ల మధ్యలోనే నిలిచిపోయి ఉండవచ్చని వెల్లడించారు. స్థానికులు సైతం ఈ ఆలయాన్ని రాక్షస రాజులే నిర్మించారని నమ్ముతుంటారు.

పక్షి పేమికుడైన లింగంపల్లి కృష్ణ అనే వ్యక్తి పక్షుల ఫోటోలు తీసేందుకు అడవిలోకి వెళ్లిన సమయంలో ఈ ఆలయాన్ని మొదటిగా కనుగొన్నారు. ఇక్కడ స్థానికులకు ఈ ఆలయం గురించి ఎప్పటి నుండే తెలిసిన పెద్దగా పట్టించుకోలేదు. ఆలయంలో ఉన్న దేవత విగ్రాహాలు, నిర్మాణ శైలిని గమనించిన ఆయన చరిత్ర కారులకు ఈ విషయం చెప్పడం, వారు గమనించిన అనంతరం ఈ ఆలయ చరిత్ర బయటకు తెలిసింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు