విషమంగా కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్యం

విషమంగా కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్యం

కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కొద్దీ రోజుల క్రితం కరోనా బారినపడిన అహ్మద్ పటేల్, గుర్గావ్‌లోని మెదంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నట్లుగా డాక్టర్లు తెలిపారు. ఆయన చికిత్సకు స్పందించడం లేదని డాక్టర్లు తెలిపారు. కాగా అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులూ ప్రస్తుతం గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అహ్మద్ పటేల్, ప్రధాని నరేంద్ర మోడీ మంచి స్నేహితులు.

ఇక మణిపూర్ సీఎం బీరేన్‌ సింగ్ కూడా కరోనా సోకింది. గత రెండు రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆదివారం పరీక్షలు చేయించుకున్నారు. దింతో కరోనా పాజిటివ్ గా తేలింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా బీరేన్‌ సింగ్ త్వరగా కోలుకోవాలని కిషన్ రెడ్డి కోరుకున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు