జూలై ఒకటి నుంచి అన్ని స్కూల్స్ ఓపెన్.. థర్డ్ వేవ్ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

telangana schools to open

కరోనా కేసులు భారీగా తగ్గిపోవటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటో తేదీ నుంచి అన్ని స్కూల్స్ ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. స్కూల్స్, కాలేజీలు, ఇనిస్టిట్యూట్స్ అన్నీ ఓపెన్ చేయాలని స్పష్టం చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ ఓపెన్ కావటం ఏడాది తర్వాతే ఇదే. మొదటి విడత లాక్ డౌన్ తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్ రీ ఓపెన్ చేయలేదు. దీంతో ప్రైవేట్ టీచర్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఏపీ ప్రభుత్వం మాత్రం గత ఏడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఐదు నెలలు స్కూల్స్ నిర్వహించినా.. తెలంగాణలో మాత్రం స్కూల్స్ ఓపెన్ చేయలేదు. ఓ విద్యా సంవత్సరం మొత్తం మూసివేసింది.

2021 విద్యా సంవత్సరాన్ని మాత్రం అన్ని రాష్ట్రాల కంటే ముందే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అన్ని స్కూల్స్ ఓపెన్ చేయాలని, ప్రభుత్వ హాస్టల్స్ అన్ని యథావిధిగా నిర్వహించాలని విద్యా శాఖను ఆదేశించింది ప్రభుత్వం.

స్కూల్స్ ఓపెన్ చేసినా.. కరోనా జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని సూచించింది. పిల్లలు అందరూ విధిగా మాస్క్ ధరించాలని.. బౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

అక్టోబర్ నుంచి థర్డ్ వేవ్ ముప్పు ఉందని సూచనలు వస్తున్న క్రమంలో.. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని.. అప్రమత్తంగా వ్యవహరించాలని కోరింది ప్రభుత్వం. ముఖ్యంగా థర్డ్ వేవ్ లో చిన్న పిల్లలపై ప్రభావం చూపిందన్న హెచ్చరికల క్రమంలో.. ఆయా పాఠశాలలు, యాజమాన్యాలు అందుకు తగిన విధంగా అప్రమత్తంగా.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది ప్రభుత్వం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు