లాక్ డౌన్ దిశగా దేశం : సంకేతాలు ఇచ్చేసిన ప్రభుత్వాలు : ముఖ్యమంత్రులకే రక్షణ లేదు

భారతదేశం రెండోసారి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంది. దేశంలో జరుగుతున్న పరిణామాలు అందుకు సంకేతంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక యూపీ రాష్ట్రాలు సీఎంలు సైతం కరోనా బారిన పడ్డారు. ఇంత కంటే సంకేతం ఏం కావాలి.. ముఖ్యమంత్రులే కరోనాతో బాధపడుతుంటే.. సామాన్యుల దుస్థితి ఇంకెంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఢిల్లీ ప్రభుత్వం ఆరు రోజులు లాక్ డౌన్ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ లోని ఐదు నగరాలు లాక్ డౌన్ పరిధిలో వెళ్లిపోయాయి. తెలంగాణ హైకోర్టు అయితే.. మీరు చర్యలు తీసుకుంటారా లేకపోతే మేం ఆదేశాలు ఇవ్వాలా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఓ వైపు ప్రభుత్వ అధినేతలు కరోనా బారిన పడుతుంటే.. మరో వైపు హైకోర్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కరోనా పరిస్థితులను చక్క దిద్దాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అది లాక్ డౌన్. ఆ దిశగా దేశ ప్రజలను సన్నద్ధం చేయటంలో భాగంగా వడివడిగా.. వేగంగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. లాక్ డౌన్ విధించటానికి ఇంత కంటే కారణాలు అక్కర్లేదు కదా.. ముఖ్యమంత్రులే కరోనా బారిన పడితే.. లాక్ డౌన్ విధించకుండా ఎలా ఉంటారు అనే కామన్ పాయింట్ బేస్ చేసుకుని కేంద్రం లాక్ డౌన్ ప్రకటించే అవకాశాలు 100 శాతం ఉన్నాయని స్పష్టం అవుతుంది.

సోమవారం రోజంతా.. ప్రధానమంత్రి మోడీ వైద్యులు, శాస్త్రవేత్తలతోపాటు ఆయా రాష్ట్రాల సీఎంలు, వైద్యాధికారులతో రోజంతా చర్చించారు. దేశంలో కరోనా తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ వివరాలు.. మందులు, ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్లు, ఆస్పత్రుల్లో చికిత్స, బాధితుల సంఖ్య.. రోజువారీ కేసులు.. వారి తీవ్రత ఇలాంటి ఎన్నో విషయాలను చర్చించింది కేంద్ర ప్రభుత్వం.

ప్రధాని మోడీ సమావేశం జరుగుతున్న సమయంలో.. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడ్డారంటూ జాతీయ మీడియా కథనాలు, వార్తలు బ్రేకింగ్స్ వచ్చాయి. ఇది తీవ్రతకు అద్దం పడుతూ.. లాక్ డౌన్ విధించాలనే డిమాండ్లు మొదలయ్యాయి..

సో.. దేశం రెండో సారి లాక్ డౌన్ దిశగా వెళ్లటానికి.. ప్రజలను సన్నద్ధం చేస్తుంది అనేది స్పష్టం అయిపోయింది.. జనం రెడీగా ఉండటమే ఇక మిగిలింది.

see also : దారుణంగా దేశ పరిస్థితులు : ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కరోనా పాజిటివ్

See also : ఎన్నికల సంఘంతో కేంద్రం చర్చలు.. కొనసాగిద్దామా.. ఆపేద్దామా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు