ఏపీ విద్యాశాఖలో అవినీతి అనకొండ.. అరాచకాల చిట్టా చూస్తే కళ్లు తిరుగుతాయ్.. విచారణపైనా అనుమానాలే

ఏపీ విద్యాశాఖలో అవినీతి అనకొండ.. అరాచకాల చిట్టా చూస్తే కళ్లు తిరుగుతాయ్.. విచారణపైనా అనుమానాలే

ఏపీ విద్యాశాఖలో అవినీతి అనకొండ.. అరాచకాల చిట్టా చూస్తే కళ్లు తిరుగుతాయ్.. విచారణపైనా అనుమానాలే

ఏపి స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు అరాచకాలు, అవినీతిపై సీఎం జగన్ ప్రభుత్వం కళ్లు తెరిచింది. విచారణకు ఆదేశించింది. విశేషం ఏంటంటే.. బి.రాజశేఖర్ (IAS)విచారణకు ఆదేశిస్తే, విచారణ అధికారిగా ఇంటర్మీడియట్ బోర్డు స్పెషల్ కమిషనర్ రామకృష్ణ IRSకి బాధ్యతలు అప్పగించారు. చిత్రమేమిటంటే.. చినవీరభద్రుడు, B.రాజశేఖర్ , IRS రామకృష్ణ ముుగ్గురు ఆప్త మిత్రులు. వాళ్లపైనే వాళ్లు విచారణలు వేసుకుని, వాళ్లే దర్యాప్తులు చేసుకుంటే ఫలితం ఎలా ఉంటుుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు.

వాడ్రేవు వీరభద్రుడిపై ఉన్న అవినీతి ఆరోపణలు, విమర్శలు చిట్టా చాలా పెద్దగానే ఉంది. ACB, CIDతో దర్యాప్తు చేయిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయంటున్నారు బాధితులు.

> ఆఫీసులోని తోటి మహిళా ఉద్యోగులను వీరభద్రుడు వేధింపులకు గురి చేశాడని.. స్త్రీలోలుడనే ఆరోపణలు ఉన్నాయి.
> నాడు- నేడు పథకంలో కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారనే విమర్శలు ఉన్నాయి.
> స్కూల్ ఎడ్యుకేషన్ బుక్స్ ప్రింటింగ్, క్వశ్చన్ పేపర్స్ ప్రింటింగ్ లో కోట్లు దిగమింగారని.. తెలంగాణాలో నిషేధించబడిన అక్షర ఎంటర్ ప్రెజస్ సంస్ద రకరకాల పేర్లతో AP స్కూల్ ఎడ్యుకేషన్ కాంట్రాక్టులు చేజిక్కించుకోవటం వెనక చిన వీరభద్రుడు ఉన్నాడనే ఆరోపణలు, విమర్శలు బహిరంగంగానే ఉన్నాయి.
> ఓ రాష్ట్రంలో నిషేధించిన సంస్థకు ఏపీలో ఎలా కాంట్రాక్టులు కట్టబెట్టటం వెనక కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది.
> అక్షర ఎంటర్ ప్రెజస్ సంస్ద అధినేత సుధీర్, MSK విజయకుమార్, వాడ్రేవు చినవీరభద్రుడు అత్యంత సన్నిహితులు. స్కూల్ ఎడ్యుకేషన్, లైబ్రరీల్లో కొనుగోళ్లు వీళ్ల ముగ్గురే నడిపిస్తున్నారనే కొన్ని కంప్లయింట్స్ సైతం ప్రభుత్వానికి రావటం కలకలం రేపుతోంది.
> స్కూల్ పిల్లల యూనిఫామ్స్ లోనూ కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
> ఒక అధికారిపై విజిలెన్స్ రిపోర్టు రాసి.. మళ్లీ దానిని వెనక్కు తీసుకోవటం వెనక అసలు కారణాలు ఏంటో నిగ్గు తేల్చాల్సి ఉంది.
> కవి, రచయిత కూడా అయిన వాడ్రేవు చినవీరభద్రుడు రాసే రచనలన్నీ MSK పబ్లికేషన్స్ ముద్రించటం.. అటు నుంచి అటు లైబ్రరీలన్నింటి చేత కొనిపించటం అంతా పక్కా వ్యూహం ప్రకారం జరుగుతుందని విమర్శలు ఉన్నాయి.

ఈ విమర్శలు, ఆరోపణల క్రమంలోనే.. ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణను తూతూ మంత్రంగా చేయకుండా.. అన్నింటిపై నిజాయితీగా విచారణ జరిపించాలని.. సీబీఐ లేదా ఏసీబీ విచారణ చేయాలనే డిమాండ్ బలంగా వస్తుంది. విద్యా శాఖలో అనకొండ మింగిన అవినీతిని కక్కిస్తారో లేదో చూడాలి…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు