లారీ డ్రైవర్ గెటప్ లో బన్నీ

పుష్ప రాజ్ వచ్చేశాడు అంటున్న పుష్ప యూనిట్.. అడవిలోకి నడుచుకుంటూ ..

పుష్ప మూవీ నుంచి అల్లు అర్జున్ గెటప్ ఫొటోను రిలీజ్ చేసింది యూనిట్. మైదాన ప్రాంతం నుంచి అడవిలోకి నడుచుకుంటూ వెళుతున్న స్టయిల్ అది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. నవంబర్ 10న ఏపీలోని మారేడుమిల్లి ఫారెస్ట్‌లో షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది.

ఈ షెడ్యూల్‌లో మూవీలోని నటులు అందరూ పాల్గొంటుండగా.. అల్లు అర్జున్ గెటప్ మాత్రం వైరల్ అయ్యింది. పుష్పరాజ్ వచ్చేశాడు అంటూ వెనక నుంచి బన్నీ నడుస్తున్న ఫొటోను షేర్ చేసింది యూనిట్. ఈ సినిమా కోసం జుట్టు పెంచి సరికొత్తగా మేకోవర్ అయ్యాడు బన్నీ.

ఎర్రచందనం స్మగ్లింగ్ కథగా సాగే ‘పుష్ప’ లో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. బన్నీ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది.

> పుష్ప రాజ్ వచ్చేశాడు అంటున్న పుష్ప యూనిట్
> లారీ డ్రైవర్ గెటప్ లో బన్నీ ఫొటో వైరల్
> అడవిలోకి నడుచుకుంటూ వెళ్లే సన్నివేశం
> ఎర్ర చందనం స్మిగ్లింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న పుష్స

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు