అల్లు అర్జున్ క్యారవాన్ ను ఢీకొన్న లారీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్యారవాన్ కు ప్రమాదం జరిగింది. పుష్ప సినిమా షూటింగ్ రంపచోడవరంలో జరుగుతుంది. అక్కడ షూటింగ్ ముంగించుకొని వస్తుండగా ఖమ్మం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంపై చిత్ర యూనిట్ ఖమ్మం రురల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రమాద సమయంలో అల్లు అర్జున్ వ్యాన్ లో లేరని చిత్ర యూనిట్ తెలిపింది. మేకప్ టీం మాత్రమే వ్యాన్ లో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంలో వ్యాన్ వెనుకభాగం స్వల్పంగా ధ్వంసమైంది. కాగా పుష్ప సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కాగా ఆగస్టు 13న పుష్ప సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

అల్లు అర్జున్ క్యారవాన్ ను ఢీకొన్న లారీ

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు