ఎన్టీఆర్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైటింగ్.. డైహార్డ్ ఫ్యాన్స్ దమ్ముచూపించారు

ఎన్టీఆర్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైటింగ్.. డైహార్డ్ ఫ్యాన్స్ దమ్ముచూపించారు

సండే అంటే వీకెండ్.. కోడి కూరతో.. నాలుగు పెగ్గులతో ఎంజాయ్ చేస్తారు కుర్రోళ్లు.. తెలుగు రాష్ట్రాల్లోని కుర్రోళ్లు మాత్రం కుమ్మేసుకున్నారు. సండే రచ్చ రచ్చ చేశారు. సోషల్ మీడియాలో మస్త్ మస్త్ మలాసా వండారు. వీళ్లు ఎవరి ఫ్యాన్స్ తో తెలుసా.. అల్లు అర్జున్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్. అలాంటి ఇలాంటి ఫ్యాన్స్ కాదండీ వీళ్లు.. డైహార్డ్ ఫ్యాన్స్..

2021, జూన్ 20వ తేదీ ట్విట్టర్ లో ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మొదలైన రచ్చ.. వరల్డ్ వైడ్ ట్రెడింగ్ అయ్యింది. ఇద్దరు హీరోల ఫ్యాన్స్. పోటాపోటీగా ట్విట్స్ వేస్తూ.. హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేశారు.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్స్
#CharacterLessPigNTR (క్యారెక్టర్ లెస్ పిగ్ ఎన్టీఆర్)
BLACKMAIL PIG NTR (బ్లాక్ మెయిల్ పిగ్ ఎన్టీఆర్ )

ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్స్

#InsecureFoxAlluArjun (ఇన్ సెక్యూర్ ఫాక్స్ అల్లు అర్జున్)

ఇద్దరు హీరోల ఫ్యాన్స్.. ఫొటోలను మార్ఫింగ్ చేసి.. గలీజు ఫొటోలతో పోటాపోటీగా రచ్చ చేశారు.

వరల్డ్ వైడ్ ట్రెండింగ్, ఇండియా ట్రెండింగ్, ఎంటర్ టైన్ మెంట్ ట్రెండింగ్ సెగ్మెంట్లలో ట్రెండ్ క్రియేట్ చేశారు.

అల్లు అర్జున్ ఫాలోవర్స్ ఆదివారం మధ్యాహ్నానానికి 2 లక్షల ట్విట్లు వేస్తే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లక్షా 70 వేల ట్విట్లతో పోటాపోటీగా ఉన్నారు.

ఇద్దరు హీరోల డైహార్డ్ ఫ్యాన్స్ మధ్య ఎక్కడ, ఎందుకు ఇగో మొదలైందో.. ప్రాబ్లమ్ ఏంటో అర్థం కాలేదు నెటిజన్లకు. సండే మాత్రం ట్విట్టర్ లో మాంచి మసాలా న్యూస్ తో సందడి చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు