మార్ఫింగ్ ఫొటోలతో తిట్టుకుంటున్న ఎన్టీఆర్ – అల్లు ఫ్యాన్స్.. హ్యాష్ ట్యాగ్స్ వెనక ఎవరున్నారు

మార్ఫింగ్ ఫొటోలతో తిట్టుకుంటున్న ఎన్టీఆర్ - అల్లు ఫ్యాన్స్.. హ్యాష్ ట్యాగ్స్ వెనక ఎవరున్నారు

మార్ఫింగ్ ఫొటోలతో తిట్టుకుంటున్న ఎన్టీఆర్ – అల్లు ఫ్యాన్స్.. హ్యాష్ ట్యాగ్స్ వెనక ఎవరున్నారు

ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వివాదం తీవ్రస్థాయికి వెళుతుంది. ఇద్దరు హీరోల డైహార్డ్ ఫ్యాన్స్.. ఒకరిపై ఒకరు నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ తో ట్విట్టర్ వార్ కు తెరలేపారు. మార్ఫింగ్ ఫొటోలు క్రియేట్ చేసి.. పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు.

#CharacterLessPigNTR

#InsecureFoxAlluArjun

ఏదో చిన్న గొడవ అని మొదట లైట్ తీసుకున్నా.. గంట గంటకు అది తీవ్రరూపం దాల్చుతుంది. పోటాపోటీగా ట్విట్లు చేస్తుండటంతో.. ట్రెండింగ్ కంటిన్యూ అవుతూ వస్తుంది. అసలు ఈ హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసింది ఎవరు.. మొదట ఎవరు దీన్ని రచ్చ చేయటం ప్రారంభించారు.. ఎందుకు చేస్తున్నారు.. ఈ ట్రెండింగ్ చేయటం వెనక ఎవరున్నారు.. వారి ఉద్దేశం ఏంటీ అనే విషయాలపై సినీ ఇండస్ట్రీ ఆరా తీస్తోంది.

ఈ విషయంలో సినీ ఇండస్ట్రీ సైతం నోరెత్తటం లేదు. ఏ ఒక్క హీరోకు మద్దతు ప్రకటించినా.. సూచనలు, సలహాలు ఇచ్చినా.. ఇంకో హీరో ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ జోలికి వెళ్లలేకపోతున్నారు సినీ ఇండస్ట్రీ పెద్దలు.

ఈ విషయాన్ని ఇలాగే వదిలేయాలని.. ఎవరికీ సుద్దులు చెప్పినా వినరని.. ఓ రోజు కొట్టుకుని వాళ్లే వదిలేస్తారని కొందరు పెద్దలు సూచించారంట.

ఇష్యూను ఇలాగే వదిలేద్దామని డిసైడ్ అయిన సినీ ఇండస్ట్రీ పెద్దలు.. దీని వెనక ఎవరున్నారు.. వారి ఉద్దేశం ఏంటీ అనే విషయాన్ని మాత్రం వదిలేయలేకపోతున్నారు. వారిపై ఆరా తీస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు