చంద్రబాబుపై సీఐడీ విచారణకు హైకోర్టు స్టే – జగన్ వ్యూహంలో చంద్రబాబుకు మరో డ్యామేజ్

నీకు స్టే రాకుంటే ఆశ్చర్యం.. వస్తే ఎందుకు?.. విచారణ అంటే చాలు కోర్టుకు పోతావ్.. వలయంలా ఉండి నేను జైలుకు వెళ్లకుండా మీరే కాపాడాలి తమ్ముళ్లూ అని ప్రసంగాలు చేస్తారు అనే డైలాగ్ మరోసారి మర్మోగుతోంది.

అమరావతిలో దళితుల భూముల కొనుగోలు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కంప్లయింట్ చేయటం.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం.. చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి నారాయణకు నోటీసులు వెళ్లటం చకచకా జరిగిపోయాయి. ఎవరూ ఊహించని.. తెర వెనక సీఎం జగన్ వ్యూహం మాత్రం ఎవరూ పసిగట్టలేకపోయారు. ఏడేళ్లుగా కేసులు, న్యాయస్థానాల్లో విచారణలతో రాటుదేలిన జగన్.. ముందస్తు వ్యూహంలో భాగంగానే చంద్రబాబుపై అమరావతి దళితుల భూముల వ్యవహారాన్ని తెరపైకి వచ్చారనేది వాదన ఉంది.

బాధితుల కంప్లయింట్స్, వారి నుంచి వివరాల సేకరణ వంటి ప్రాథమిక అంశాలను విస్మరించటంతోపాటు.. ఏకంగా మాజీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇవ్వటం ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును డిఫెన్స్ లోకి వెళ్లారు సీఎం జగన్. నోటీసులు ఇవ్వగానే చంద్రబాబు కోర్టుకు వెళతారు.. ఎఫ్ఐఆర్ లో ఇంకా పూర్తి సమాచారం లేదు కాబట్టి సహజంగా హైకోర్టు స్టే ఇవ్వటం లేదా మరో రకంగా తీర్పు ఇస్తుంది.

అప్పుడు అందరూ అనుకుంటున్నట్లు చంద్రబాబుకు మరో స్టే వచ్చింది అని టాక్ జనంలోకి వెళ్లిపోతుంది. తప్పే చేయనప్పుడు విచారణ ఎదుర్కోవచ్చు కదా.. కనీసం సీఐడీ ఆఫీసుకు వెళ్లకుండానే కోర్టుకు వెళ్లారు చంద్రబాబు అనే డిస్కషన్ పాయింట్ రైజ్ కావటంతోపాటు.. గతంలో చంద్రబాబుపై వివిధ కోర్టుల్లో ఉన్న కేసులు – వాటిపై స్టేలు మరోసారి చర్చనీయాంశం అవుతాయి..

సరిగ్గా ఇప్పుడు ఇదే జరిగింది. అమరావతిలో దళితుల భూముల కొనుగోలు అంశంపై చంద్రబాబు విచారణకు హైకోర్టు స్టే ఇవ్వటం ద్వారా మరోసారి చంద్రబాబు నిప్పు అని చెప్పుకోవచ్చు కానీ.. మరో స్టే అనే అపవాదును తొలగించుకోలేరు. దళితుల అసైన్డ్ భూములు టీడీపీ వర్గీయులు కొనుగోలు చేశారని.. వాటిని సీఆర్డీఏకు అప్పగించి కోట్ల రూపాయలు తీసుకున్నారు అనేది అందరికీ తెలిసిందే. దళితుల భూముల విషయంలోనూ చంద్రబాబు నిజాయితీని నిరూపించుకోకుండా.. కోర్టుకు వెళ్లి విచారణ నుంచి తప్పించుకోవటం అంటే.. మరోసారి జగన్ ఉచ్చులో చిక్కి.. డ్యామేజ్ అయిన చంద్రబాబు ఇమేజ్ అనుకుంటున్నారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే.. అనుకున్నదే కదా అనే డైలాగ్ అందరి నోట వచ్చింది అంటే.. న్యాయ పరంగా తప్పుపట్టలేం కానీ.. రాజకీయంగా చంద్రబాబుకు మరో డ్యామేజ్ అనుకోవచ్చు.

కనీసం సీఐడీ విచారణకు హాజరయ్యి ఉన్నా కొంచెం పోరాట స్ఫూర్తి కనబరిచారని అనుకోవచ్చు.. ఆ తర్వాత కోర్టుకు వెళ్లి ఉంటే బాగుండేదేమో.. అలా కాకుండా నోటీసుల దగ్గరే కోర్టుకు వెళ్లటం అంటే.. జగన్ వ్యూహంలో చంద్రబాబుకు జనంలో ఆటోమేటిక్ గానే నెగిటివ్ థింగింగ్ కంటిన్యూ అయ్యిందే అని చెప్పాలి.

నీకు స్టే రాకుంటే ఆశ్చర్యం.. వస్తే ఎందుకు?.. విచారణ అంటే చాలు కోర్టుకు పోతావ్.. వలయంలా ఉండి నేను జైలుకు వెళ్లకుండా మీరే కాపాడాలి తమ్ముళ్లూ అని ప్రసంగాలు చేస్తారు అనే డైలాగ్ మరోసారి మర్మోగుతోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు