అంబులెన్స్ లకు దారిచ్చే పరిస్థితి నుంచి.. అంబులెన్సులే తిరుగుతున్న సిట్యువేషన్ చూస్తున్నాం…

అంబులెన్స్ లకు దారిచ్చే పరిస్థితి నుంచి.. అంబులెన్సులే తిరుగుతున్న సిట్యువేషన్ చూస్తున్నాం...

Ambulance services
Ambulance services

అంబులెన్స్ లకు దారిచ్చే పరిస్థితి నుంచి.. అంబులెన్సులే తిరుగుతున్న సిట్యువేషన్ చూస్తున్నాం…

హైదరాబాద్ అనే కాదు.. దేశవ్యాప్తంగా మొన్నటి వరకు ఓ నినాదం.. అంబుటెన్స్ లకు దారివ్వండి.. ప్రాణాలను కాపాడండి.. అంబులెన్స్ కు దారివ్వకపోతే 10 వేల జరిమానా అంటూ పదేపదే ప్రకటనలు విన్నాం.. చూశాం.. ట్రాఫిక్ లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం.. దీనిపై ఎన్నో సినిమాలు సైతం వచ్చాయి..

ఇప్పడు దేశంలో సీన్ మారిపోయింది.. రోడ్లపై జనం తిరిగే వాహనాల కంటే అంబులెన్స్ సైరన్స్.. అంబులెన్స్ ల హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, గుంటూరు ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ఏ రహదారులు చూసినా.. అంబులెన్స్ లు విరామం లేకుండా తిరుగుతున్నాయి. రోడ్డుపై తిరిగే జనం మాట సైతం ఇలాగే ఉంది.. గతంలో అంబులెన్స్ కు దారిచ్చే పరిస్థితి నుంచి.. ఇప్పుడు రోడ్లపై అంబులెన్సులే తిరుగుతున్నాయి అనే మాట వినిపిస్తోంది.

కరోనా మరణాలతోపాటు అనారోగ్యంతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం వల్లే ఇలాంటి దుస్థితి నెలకొంది. మే 5వ తేదీ ఒక్క రోజే దేశవ్యాప్తంగా అధికారంగా 4 వేల మంది చనిపోయారు.. లెక్కలోకి రానివి ఇంకెన్నో.. కరోనాతో చనిపోతే కుటుంబ సభ్యులు, బంధువులు సైతం దగ్గరకు రాని దుస్థితి.. మృతదేహాలను అంబులెన్సుల్లో ఎక్కించి నేరుగా శ్మశాలకు తీసుకెళుతున్నారు. ఆస్పత్రి నుంచి నేరుగా చితిపైకి వెళుతున్నాయి మృతదేహాలు. కడచూపునకు సైతం నోచుకోవటం లేదు.. సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహించలేని దుస్థితి. చుట్టాలు, బంధువులు, ఆప్తులు అందరూ చివరి చిపునకు నోచుకోకపోవటంతోపాటు.. అంబులెన్స్ లో ఎక్కించటంతోనే చివరి చూపు అయిపోతుంది.

ఎంతలో ఎంత మార్పు.. ఒకప్పుడు అంబులెన్స్ కోసం దారివ్వండి అని మొత్తుకున్న మానవతావాదులు.. ఇప్పుడు అంబులెన్సులు మాత్రమే తిరుగుతున్నాయి రోడ్లపై..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు