#sugerlysurvey ఆనందయ్య మందును ఆన్ లైన్ లోనే తీసుకుంటాం.. ప్లీజ్ అనుమతించండి.. నెటిజన్ల డిమాండ్

ఆనందయ్య మందును ఆన్ లైన్ లోనే తీసుకుంటాం.. ప్లీజ్ అనుమతించండి.. నెటిజన్ల డిమాండ్

anandayya medicine
anandayya medicine

ఆనందయ్య మందు పంపిణీపై జరుగుతున్న రగడ జరుగుతుంది. స్కాం అని.. వందల కోట్ల మాఫియా అని అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మందు పంపిణీ ప్రారంభం కాకముందే ఇలాంటి వివాదాలు రావటంపై నెటిజన్లు అవాక్కయ్యారు. ఆనందయ్య మందు పంపిణీపై ప్రజల అభిప్రాయాలను సేకరించింది షుగర్లీ.కామ్ ( sugerly.com) ఏ విధంగా పంపిణీ చేస్తే సౌలభ్యంగా ఉంటుందని ప్రశ్నించింది. జూన్ 4, 5 తేదీల్లో ఆన్ లైన్ ద్వారా నెటిజన్ల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారి అభిప్రాయాలు ఇలా..

  1. ఆనందయ్య మందును ఆన్ లైన్ ద్వారా పంపిణీ చేయాలి. అది అతని సొంత వెబ్ సైట్ లేదా ప్రభుత్వ వెబ్ సైట్ అయినా పర్వాలేదు.
  2.  మందు పంపిణీ అనేది ముఖ్యం. కరోనా కాలంలో ఆనందయ్య మందు అందరికీ అందబాటులోకి తీసుకురావటం అనేదే ప్రధానమైన అంశం.
  3. అందరూ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వెళ్లి తెచ్చుకోవాలంటే సాధ్యం కాదు.
  4. కష్ణపట్నం వెళ్లి మందు తెచ్చుకోవాలంటే వేలకు వేలు ఖర్చు అవుతుంది. ఆన్ లైన్ ద్వారా అయితే డెలివరీ చార్జీలతో సహా వంద రూపాయల్లోనే అయిపోతుంది.
  5. స్విగ్గీ, జొమాటో వంటి సైట్స్ ద్వారా ఆర్డర్ చేసినా డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తున్నారు కదా.. ఇప్పుడు ఆనందయ్య మందు పంపిణీలో కుంభకోణం ఏ విధంగా ఉంటుందీ అనేది నెటిజన్లు పాయింట్.
  6. ఆనందయ్య మందు 15 రూపాయలుగా నిర్ణయించారు.. మిగతాది డెలివరీ ఛార్జీలే కదా..
  7. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య దగ్గరకు వెళ్లి మందు తెచ్చుకోవాలంటే కారులో అయితే 10 వేలు ఖర్చు అవుతుంది.
  8. 15 రూపాయల మందు కోసం 10 వేల రూపాయలు ఖర్చు చేయటం అనేది అత్యవసరంలో అయితే పర్వాలేదు కానీ.. అందరికీ ఎలా సాధ్యం అవుతుంది.
  9. ఆన్ లైన్ ద్వారా అయితే ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్స్ పెట్టుకోవచ్చు.. ఇంటికే నేరుగా తెచ్చి ఇస్తున్నారు.. ఇందులో అభ్యంతరాలు, అనుమానాలు ఎక్కడ ఉన్నాయి.
  10. మందు ఖరీదు వేల కాదు.. కేవలం రూపాయల్లోనే ఉంది.. ఇందులో సందేహాలు ఉండటం అనుమానించాల్సిందే కదా.
  11. ఆనందయ్య మందును ఆన్ లైన్ ద్వారా మాత్రమే పంపిణీ చేయాలని నెటిజన్లు ఒక్కటిగా వాయిస్ రైజ్ చేశారు.
  12. కరోనా కాలంలో ఆనందయ్య మందును రాజకీయం చేయటం.. పంపిణీపై ఆంక్షలు, విమర్శలు, ఆరోపణలు అనేవి మానవత్వం లేనివాళ్లు చేస్తారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వందల కోట్ల స్కామ్ అని టీడీపీ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నా.. మందు పంపిణీ అనేది ముఖ్యం అని.. అది కూడా ఆన్ లైన్ ద్వారానే పంపిణీ జరగాలని డిమాండ్ చేస్తున్నార నెటిజన్లు. రాజకీయ విమర్శలను పట్టించుకోవటం లేదు. చారణా కోడికి.. బారాణా మసాలా అన్న చందంగా తయారు చేయొద్దని కోరుతున్నారు. ఏదో ఒక వెబ్ సైట్.. 15 రూపాయలకే మందు దొరుకుతుంటే.. దాన్ని కూడా ఇలా విమర్శలు, ఆరోపణలతో నిలిపివేసే విధంగా ప్రవర్తించటాన్ని మాత్రం అస్సలు సహించటం లేదు కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టాలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు