యాంకర్ శ్యామల భర్త అరెస్ట్.. కోటి రూపాయల చీటింగ్.. ఆమెపైనే వేధింపులు.. మరో మహిళతో సెటిల్ మెంట్లు..

యాంకర్ శ్యామల భర్త అరెస్ట్.. కోటి రూపాయల చీటింగ్.. ఆమెపైనే వేధింపులు.. మరో మహిళతో సెటిల్ మెంట్లు..

anchor syamala husband arrest
anchor syamala husband arrest

యాంకర్ శ్యామల అంటే అబ్బో అంటాం.. ఇటీవల తన పదేళ్ల ప్రేమ, పెళ్లికి గుర్తుకు సాంగ్ సైతం రిలీజ్ చేసింది శ్యామల. యాంకరింగ్ తోపాటు.. మూవీ ఆడియో ఫంక్షన్స్, షాపు, దుకాణాల ఓపెనింగ్స్ తో నాలుగు చేతుల సంపాదిస్తుంది శ్యామల అనుకుంటున్నారు అందరూ. ఆమె భర్త నర్సింహారెడ్డి మాత్రం తెర వెనక బాగోతం వెలుగులోకి రావటం ఆసక్తిగా మారింది.

యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి ఓ మహిళ దగ్గర కోటి రూపాయలు తీసుకున్నాడు.. 2017 నుంచి విడతల వారీగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకపోవటంతోపాటు.. డబ్బులు అడిగిన మహిళపైనే బెదిరింపులకు దిగాడు. మూడేళ్లుగా అప్పుడప్పుడు ఆ మహిళ నుంచి కోటి రూపాయలు తీసుకోవటమే కాకుండా.. ఆమెపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంట.. ఇలా జరిగిందని ఆ మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసింది. డబ్బుల విషయంలో తలెత్తిన గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళుతుందని భావించిన శ్యామల భర్త నర్సింహారెడ్డి.. ఓ మహిళ ద్వారా రాయబారం నడిపాడంట. కేసు గీసూ ఏమీ లేదు.. సెటిల్ మెంట్ చేసుకుందాం అని మరో మహిళ ద్వారా మధ్యవర్తిత్వం చేసినట్లు తెలుస్తోంది.

రాజీ విషయంలోనూ శ్యామల భర్త నర్సింహారెడ్డి వ్యవహరించిన తీరుతో ఇగో హర్ట్ అయిన బాధిత మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కోటి రూపాయల చీటింగ్, లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసింది. పోలీసులు ప్రాథమిక విచారణ తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మధ్యవర్తిత్వం వహించిన మహిళను సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మంగళవారం ఇద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ తరలించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు