నీళ్ల కోసం మూర్ఖంగానే ముందుకెళతాం.. తెలంగాణ కేబినెట్ లో చర్చపై ఏపీ రియాక్షన్

నీళ్ల కోసం మూర్ఖంగానే ముందుకెళతాం.. తెలంగాణ కేబినెట్ లో చర్చపై ఏపీ రియాక్షన్

నీళ్ల కోసం మూర్ఖంగానే ముందుకెళతాం.. తెలంగాణ కేబినెట్ లో చర్చపై ఏపీ రియాక్షన్

ఏపీ ప్రయోజనాలు.. ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ఎందాకైనా.. ఎంత దూరం అయినా వెళతాం.. మూర్ఖంగానే ముందుకెళతాం.. అవసరం అయితే కొట్లాటకు సైతం రెడీ అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఏపీ రాష్ట్ర వాటా ప్రకారమే నీళ్లను ఎత్తిపోస్తున్నామని.. ఇందులో ఎవరి దయాదాక్షణ్యాలు అవసరం లేదనేది అధికార పార్టీ మాట. జూన్ 19వ తేదీ తెలంగాణ కేబినెట్ భేటీలో ఏపీ ప్రాజెక్టులపై చర్చ జరగటం.. ఈ చర్చలో సీఎం జగన్ వైఖరిపై సీఎం కేసీఆర్ కామెంట్లు చేసినట్లు పత్రికల్లో వార్తలు రావటంపై వైఎస్ఆర్ కాంగ్రెైస్ పార్టీ నేతలు స్పందించారు.

జగన్ మూర్ఖుడు.. తండ్రి మించిపోయాడు.. అక్రమ ప్రాక్టులతో నీళ్లు ఎత్తుకెళ్తున్నాడు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని.. అవసరం అయితే ఢిల్లీలో ధర్నా చేస్తామని కేసీఆర్ అన్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై సీరియస్ గానే స్పందిస్తున్నారు ఏపీ అధికార పార్టీ నేతలు.

ఆరు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మంచినీటి, సాగునీటి అవసరాల కోసం.. రైతుల కోసం మూర్ఖంగా ముందుకెళ్లకుండా.. తెలంగాణ దయాదాక్షణ్యాలపై ఆధారపడతామా ఏంటీ అనే వైఖరితో ఉన్నారు నేతలు. ఏపీ రైతుల కోసం.. తెలంగాణ మొండి వైఖరికి నిరసనగా మేం కూడా ఆందోళన చేస్తామంటున్నారు నేతలు.

ఏపీలో చేపడుతున్న కొత్త ప్రాజెక్టులు, కాలువల సామర్థ్యం పెంపు అంతా భవిష్యత్ అవసరాల కోసమే అని.. మిగులు జలాలు, వరద నీటిని ఎత్తిపోసుకోవటం కోసమే అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. మా రాష్ట్రంలో.. మా ప్రాంతంలో.. మా గడ్డపై మేం ప్రాజెక్టులు కట్టుకుంటే ఎగువ రాష్ట్రం తెలంగాణకు ఉన్న అభ్యంతరం ఏంటీ అనేది వైసీపీ నేతల ప్రశ్న.

తెలంగాణ వాటా వాడుకున్న తర్వాతే కదా నీటిని కిందకు వదిలేది.. వరదలు వచ్చినప్పుడు వృధాగా సముద్రంలోకి నీళ్లు పోకుండా.. ఆ నీటిని తరలించుకుంటే తప్పేంటనేది ఏపీ రైతులు, ప్రజల మాట.

తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా రాద్దాంతం చేస్తుందని.. ఈ విషయంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క అంగుళం కూడా వెనక్కి వేసిది లేదని.. రాయలసీమతోపాటు డెల్టా ప్రాంతంలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వటమే లక్ష్యం అంటున్నారు ఏపీ ప్రభుత్వ పెద్దలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు