ఏపీ అసెంబ్లీ 5 రోజులు : 21 బిల్లులపై చర్చ

ఏపీ అసెంబ్లీ 5 రోజులు : 21 బిల్లులపై చర్చ.. సంపూర్ణ మద్య నియంత్రణలో భాగంగా మద్యం నియంత్రణ, ప్రభుత్వ సంస్కరణలు కీలక అంశం కానుంది.

andhra pradesh assembly
andhra pradesh assembly

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. 5 రోజులు నిర్వహించాలని బీఏసీని నిర్ణయించారు. మొత్తం 21 బిల్లులపై చర్చ తర్వాత ఆమోదించాలని నిర్ణయించింది సీఎం జగన్ ప్రభుత్వం. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం వరకు అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులు ఈ విధంగా ఉండనున్నాయి.

పోలవరం ప్రాజెక్ట్‌ పురోగతి, నిధుల అంశంతోపాటు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని తప్పిదాలపై చర్చ జగనుంది. ఇళ్లపట్టాల పంపిణీ- ప్రతిపక్షాల కుట్ర, టిడ్కో గృహాలు-వాస్తవాలను అసెంబ్లీ వేదికగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీ కరణ- ప్రతిపక్షాల కుట్ర, వెనుకబడిన వర్గాల సంక్షేమం, కార్పొరేషన్లు ఏర్పాటు బిల్లును ఆమోదించనున్నారు.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కరోనా నియంత్రణ- ప్రభుత్వ చర్యలకు సంబంధించి చర్చ జరగనుంది. వైద్య, ఆరోగ్య రంగం- ఆరోగ్యశ్రీ సంక్షేమంపై చర్చ ఉంటుంది. వ్యవసాయం ఇన్‌పుట్‌సబ్సిడీ, ఆర్‌బీకేలు, సున్నావడ్డీ రుణాలు, మద్దతు ధర, వైఎస్‌ఆర్‌ జలసిరి ఎజెండాగా ఉంది. ఇక గ్రామసచివాలయాలు, మైరుగైన పనితీరు, లోపాలపైనా చర్చతోపాటు బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై చర్చించి.. ప్రభుత్వం అనుమతితోనే ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ చేస్తోంది. ఇటీవలే ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరు, మహిళా సాధికారికత, వైఎస్‌ఆర్‌ చేయూత, ఆసరా, సున్నావడ్డీ అంశం ఎజెండా చేర్చింది ప్రభుత్వం.

ఇక సంపూర్ణ మద్య నియంత్రణలో భాగంగా మద్యం నియంత్రణ, ప్రభుత్వ సంస్కరణలు కీలక అంశం కానుంది.

సాగునీటి ప్రాజెక్ట్‌లు, రివర్స్‌ టెండరింగ్‌, అవినీతి నిర్మూలన, పారదర్శక పాలన ప్రధాన ఎజెండాగా ఉండనుంది. పారిశ్రామికాభివృద్ధి, ప్రభుత్వ చర్యలు, 9 గంటల ఉచిత విద్యుత్‌, ప్రభుత్వ సంస్కరణలు, నూతన ఇసుక విధానం బిల్లులపై చర్చ జరగనుంది.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు