ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కర్ఫ్యూ సడలింపు పొడిగింపు.. 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కర్ఫ్యూ సడలింపు పొడిగింపు.. 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. జూన్ 20వ తేదీ వరకు కర్ఫ్యూను పొడిగించిన ప్రభుత్వం.. సడలింపు సమయాన్ని సైతం పొడిగించింది. మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది సీఎం జగన్ సర్కార్.

ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల వరకే సడలింపు ఉంది.. ఇక నుంచి ఏపీలో మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు ఉండనుంది. కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో రెండు గంటలు అదనంగా పొడించింది ప్రభుత్వం.

ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయనున్నాయి. వ్యాపార, రవాణాను సైతం మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

ఇక నుంచి ఏపీలో మధ్యాహ్నం 2 నుంచి తర్వాత రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేయనున్నారు.

అంతర్ రాష్ట్ర రవాణాపై ఆంక్షలు యథావిధిగా ఉండనున్నాయి.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు