జెడ్పీటీసీ, ఎంపీసీటీ కౌంటింగ్ పై జగన్ సర్కార్ కు ఊరట.. డివిజన్ బెంజ్ పాజిటివ్ తీర్పు

జెడ్పీటీసీ, ఎంపీసీటీ కౌంటింగ్ పై జగన్ సర్కార్ కు ఊరట.. డివిజన్ బెంజ్ పాజిటివ్ తీర్పు

జెడ్పీటీసీ, ఎంపీసీటీ కౌంటింగ్ పై జగన్ సర్కార్ కు ఊరట.. డివిజన్ బెంజ్ పాజిటివ్ తీర్పు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయ్యి.. కౌంటింగ్ నిర్వహించాల్సిన సమయంలో హైకోర్టు సింగిల్ బెంజ్ తీర్పుతో బ్రేక్ పడింది. ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై.. 2021, జూన్ 25వ తేదీ డివిజన్ బెంచ్ లో విచారణ జరిగింది.

వాదనలు విన్న డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ.. డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిన క్రమంలో.. ఆ తీర్పును సింగిల్ బెంచ్ ఎలా రద్దు చేస్తుందన్న ఏపీ ప్రభుత్వం వాదనలతో ఏకీభవించింది న్యాయ స్థానం. ఈ క్రమంలోనే స్టే విధించింది.

దీనిపై జూన్ 27వ తేదీ పూర్తి స్థాయిలో వాదనలు విని తీర్పు ఇవ్వటం జరుగుతుందని.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కౌంటింగ్ చేయరాదని స్పష్టం చేసింది డివిజన్ బెంచ్.

డివిజన్ బెంచ్ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం.. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే రావటంతో 27వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్ అవుతుందని భావిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు