యుద్ధానికి దిగిన నిమ్మగడ్డ.. పంచాయతీ ఎన్నికల నోటిఫికేష్ విడుదల.. ప్రభుత్వం కాదన్నా ప్రకటన

యుద్ధానికి దిగిన నిమ్మగడ్డ.. పంచాయతీ ఎన్నికల నోటిఫికేష్ విడుదల.. ప్రభుత్వం కాదన్నా ప్రకటన

ఏపీలో మరోసారి పంచాయతీ ఎన్నికల వార్ మొదలైంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదని.. స్వయంగా చీఫ్ సెక్రటరీ వెళ్లి మరీ కమిషన్ నిమ్మగడ్డకు వివరించిన కొద్ది గంటల్లోనే.. ఏకంగా షెడ్యూల్ విడుదల చేశారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.

జనవరి 23 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది
నాలుగు దశలుగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు
ఈ నెల 23, తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది
ఈ నెల 27న రెండో దశ ఎన్నికలకు
ఈ నెల 31న మూడో దశ ఎన్నికలకు

ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది
ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు
ఫిబ్రవరి 9న రెండో దశ పంచాయతీ ఎన్నికలు
ఫిబ్రవరి 13 మూడో దశ పంచాయతీ ఎన్నికలు
ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు

ఏపీలో జనవరి 9వ తేదీ నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది

సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం
కరోనా వ్యాక్సినేషన్ సన్నద్దలో అధికార యంత్రాంగం ఉంటుందన్న ప్రభుత్వం
వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటున్న ప్రభుత్వ వర్గాలు…
ఎస్ఈసీ షెడ్యూల్ ను నిలువరించాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు