వచ్చే ఫిబ్రవరిలో ఏపీలో పంచాయితీ ఎన్నికలు – డిసైడ్ చేసేసిన నిమ్మగడ్డ

ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరమైన అవసరం అన్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. తెలంగాణలో జీహెచ్ఎంసీ

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్నామని.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించి తీరాలని భావిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. న్యాయపరమైన ఇబ్బందులు లేనందున ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా ఉధృతి కూడా తగ్గిందని.. రోజూ 10వేల కేసుల నుంచి 700 కేసులకు తగ్గిందని.. ఎన్నికలు నిర్వహించటానికి ఇది కరెక్ట్ టైం అని డిసైడ్ అయిపోయారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం అని.. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎంతో ముఖ్యం అన్నారు ఈసీ. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరమైన అవసరం అన్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.

ఇప్పటికే అన్ని పార్టీలతో సమావేశం కూడా నిర్వహించింది ఎస్ఈసీ. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి దూరంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని.. పిల్లల స్కూల్స్ ఇప్పుడే ప్రారంభం అయ్యాయని.. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని ప్రభుత్వం ఎస్ఈసీకి రిపోర్ట్ ఇచ్చింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు