గవర్నర్ ప్రశ్నలతో నిమ్మగడ్డ రమేశ్ ఉక్కిరిబిక్కిరి – ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ముందుకెళ్లాలని సూచన

గవర్నర్ విశ్వభూషణ్ ప్రస్తావించిన అంశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ నీళ్లు నమిలారంట. ప్రభుత్వం కావాలని

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి.. ప్రభుత్వంతో నడుస్తున్న వ్యవహారాలపై గవర్నర్ బిశ్వబూషణ్ ను కలిసి తన ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీలో ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయంట. గవర్నర్ విశ్వభూషణ్ ప్రశ్నలకు తడబడ్డారు అంట నిమ్మగడ్డ
35 కేసులు ఉన్నప్పుడు ప్రభుత్వంతో సంప్రదించకుండా వాయిదా వేసింది మీరే కదా.. ఇప్పుడు కరోనా ఇంకా తీవ్రంగా ఉంది.. కేసుల సంఖ్య తగ్గినా మళ్లీ ఎక్కువ అవుతుందని నివేదికలు చెబుతున్నాయి.. దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవటం లేదా.. ప్రజా ఆరోగ్యం ముఖ్యం కదా అని నిమ్మగడ్డకు గవర్నర్ నేరుగా ప్రశ్నించే సరికి నీళ్లు నమిలారంట రమేశ్ కుమార్

ఏపీలో కరోనా తీవ్రంగా చాలా ఎక్కువగా వచ్చింది.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది.. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం చాలా వరకు ఇప్పటికీ కరోనా నియంత్రణ పనుల్లోనే ఉంది. వైద్య వ్యవస్థకు ఇంకా రిలీఫ్ దొరకలేదు.. గ్రామస్థాయిలో జరిగి ఈ ఎన్నికలను ఇప్పుడు నిర్వహించటం వల్ల తెలిసి తెలిసి మళ్లీ కరోనా కేసులను పెంచినట్లు అవుతుంది కదా.. ఈ విషయాలన్నీ మీకు తెలియనివి కాదు కదా అన్నారంట.

కోర్టు ఆదేశాలు అనుసరించి మీరు ఎన్నికలు నిర్వహిస్తున్నాను అంటున్నారు.. 2018లో ఏడాదిన్నర కాలం.. అంటే 18 నెలలు ఎన్నికలు నిర్వహించకుండా ఎందుకు ఉన్నారు.. ఏ వ్యవస్థ మిమ్మల్ని అడ్డుకుని ఉంది అనుకోవాలి అంటూ తన డౌట్స్ ను వ్యక్తం చేశారంట గవర్నర్ గారు.

రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలోని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని.. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూడలేం కదా.. రాష్ట్ర ప్రభుత్వం వాదనను కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా అన్నారంట.

గవర్నర్ విశ్వభూషణ్ ప్రస్తావించిన అంశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ నీళ్లు నమిలారంట. ప్రభుత్వం కావాలని వాయిదా వేస్తుందని.. ఇష్టంలేక సహకరించటం లేదని తన లేఖ ద్వారా తెలియజేశారంట. గవర్నర్ మాత్రం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ముందుకెళ్లాలని.. ప్రభుత్వం యంత్రాంగం సహకారం లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారంట.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు