అవాక్కయ్యారా.. సీఎం కేసీఆర్ ను తిట్టిన ఆమెపై.. బెజవాడలో పోలీస్ కంప్లయింట్

అవాక్కయ్యారా.. సీఎం కేసీఆర్ ను తిట్టిన ఆమెపై.. బెజవాడలో పోలీస్ కంప్లయింట్

Andhrapradesh trs wing
Andhrapradesh trs wing

అవాక్కయ్యారా.. సీఎం కేసీఆర్ ను తిట్టిన ఆమెపై.. బెజవాడలో పోలీస్ కంప్లయింట్

ఏంటీ.. టైటిల్ చూడగానే షాక్ అయ్యారా.. వింతగా అనిపించిందా.. అందరికీ ఇలాంటి ఫీలింగే వచ్చిందిలేండీ.. ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ పార్టీ ఉందని.. ఆ పార్టీకో అధ్యక్షుడు ఉన్నాడని ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ఇంతకీ వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్రం చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మహిళా అధ్యక్షురాలు బొడిగె శోభ ఇటీవల ఓ పొలిటికల్ పార్టీ మీటింగ్ లో.. సీఎం కేసీఆర్ ను చడామడా తిట్టారు. అమ్మనాబూతులు ఒక్కటే తక్కువ. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఓ సీఎంను పట్టుకుని ఇన్నేసి మాటలు అనటంపై విమర్శలు వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే.. బొడిగే శోభపై విజయవాడలో కంప్లయింట్ ఇచ్చారు.

తెలంగాణ బీజేపీ మహిళా నేత శోభపై బెజవాడ పోలీస్ కమిషనరేట్ లో కంప్లయింట్ ఇచ్చింది ఎవరో తెలుసా.. ఏపీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొణిజేటి ఆదినారాయణ. ఏప్రిల్ 6వ తేదీ మంగళవారం రాత్రి ఈ కంప్లయింట్ ఇచ్చారు. దీనిపై ఇంకా కేసు నమోదు కాకపోయినా.. కంప్లయింట్ ఇవ్వటమే పెద్ద చర్చ అయ్యింది.

ఏపీలో టీఆర్ఎస్ పార్టీ ఉందా.. దానికో అధ్యక్షుడు ఉన్నాడా అనే విషయం వెలుగులోకి రావటం విశేషం. తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ నేతలే కంప్లయింట్ ఇవ్వలేదు.. అధికార పార్టీనే సైలెంట్ గా ఉంది.. ఎవరూ పట్టించుకోవటం లేదు.. మా సార్ ను అన్నేసి మాటలు అంటారా అని ఎవరూ నోరు మెదపలేదు.. అలాంటిది ఏపీలో టీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా సీరియస్ గా తీసుకోవటం.. పోలీస్ కంప్లయింట్ ఇవ్వటం విశేషం.

కంప్లయింట్ లో బోడిగె శోభ మాట్లాడిన వీడియో లింక్స్ ఐడీలు కూడా సమర్పించారంట. వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారంట. ఏమైనా టీఆర్ఎస్ పార్టీపై ఏపీలో ఉన్న అభిమానానికి ఇదో మచ్చుతునక.

అప్పట్లో అమెరికాలో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందేమో అని నారా లోకేషన్ అన్నట్లే.. ఇప్పుడు ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే అధికారంలోకి వస్తుందేమో.. ఏమో గుర్రం ఎగరనూ వచ్చు.. ఎవరు కలగన్నారు.. ఇప్పటికైతే రాజకీయ వింతల్లో ఇదొకటి..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు