కుప్పకూలిన అంబానీ సామ్రాజ్యం. ఆస్తుల వేలానికి సిద్ధం.

కుప్పకూలిన అంబానీ సామ్రాజ్యం.. ఆస్తుల వేలానికి సిద్ధం.

అంబానీ సామ్రాజ్యం అంటే సాధారణమైనది కాదు. ధీరూబాయ్ అంబానీ టైం నుంచి అంచలంచలుగా ఎదుగుతూ దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థాపించారు. ధీరూభాయ్ అంబానీ పోయిన తర్వాత కొద్దీ కాలానికి అనిల్ అంబానీ, ముకేశ్ అంబానీ మధ్య ఆస్తుల పంపకం జరిగింది. నాటి నుంచి కొత్త విధానాలు అవలంబిస్తూ ముకేశ్ అంబానీ దూసుకుపోతున్నారు. దేశంలో కొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నారు. జియోతో దేశ టెలికామ్ రంగాన్ని మార్చి పడేశాడు..

సామాన్యుడికి కూడా అంతర్జాలాని చేరువచేశాడు. ఇలా ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు.. ఇక తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం రోజు రోజుకు దిగజారిపోతున్నాడు. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ ను నడపలేక చేతులెత్తేశాడు. దేశ విదేశాల్లో చేసిన అప్పులు చెల్లించలేక రిలయన్స్ ఆస్తులను అమ్ముకుంటున్నాడు..

కాగా రిలయన్స్ క్యాపిటల్ కు సంబంధించి, ఆసక్తి ఉన్నవర్గాల నుంచి బిడ్లను ఆహ్వానించినట్టు సమాచారం. దాదాపు 20వేల కోట్ల రూపాయల బకాయిల కోసం కీలక ఆస్తులను విక్రయించే ప్రక్రియను ప్రారంభించాయని సీఎన్‌బీసీ నివేదించింది. ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లెండర్స్‌ తరపున ఈ ప్రక్రియను చూడనున్నాయి.

ఆర్‌సీఎల్ రుణంలో 93 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న డిబెంచర్ హోల్డర్ల కమిటీ శనివారం ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ లను ఆహ్వానించింది. ఈ బిడ్లను సమర్పించేందుకు తుది గడువు 2020 డిసెంబర్‌ ఒకటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

ఇక అమ్మకానికి పెట్టిన వాటిని ఓ సారి పరిశీలిస్తే రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 51 శాతం వాటా, రిలయన్స్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ ఫైనాన్షియల్ లిమిటెడ్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ అసెట్ రీ కన్‌స్ట్రక్షన్‌లో 49శాతం వాటా, ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 20 శాతం వాటా, రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాతోపాటు సంస్థ ఇతర ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను అమ్మి బకాయిగా జమ కట్టుకోనుంది.

ఇక వీటిపై రిలయన్స్ స్పందించాల్సి ఉంది. అంతే కాదు చైనాకు చెందిన బ్యాంకులకు కూడా అనిల్ పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంది. మార్చిలో ఈ కేసు వాదనకు అనిల్ 400 కోట్ల రూపాయల పై చిలుకు నగదును లండన్ బ్యాంకుకు సమర్పిచారు. కొంత నగదును డిపోసిట్ చేస్తేనే తాము కేసు విచారణ సాగుతుందని చెప్పడంతో 400 కోట్ల రూపాయలను చెల్లించారు.

తమ్ముడు అనిల్ దగ్గర లేకపోవడంతో అన్న ముకేశ్ డబ్బు చెల్లించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ముకేశ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే తాను ఆర్థికంగా చితికిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తన వద్ద ఇల్లు కారు మినహా ఏమి లేదని అనిల్ గత నెలలో పలు వ్యాఖ్యలు చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు