డిసెంబర్ లో బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు

డిసెంబర్ లో బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు .. మధ్య, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ రెండు కూడా.. నివర్ తుఫాన్ కారణంగా ఏర్పడ్డాయని చెబుతున్నారు.

2020 సంవత్సరం ఏ ముహూర్తాన ఎంట్రీ అయ్యిందో కానీ.. జనాన్ని మాత్రం ప్రశాంతంగా బతకనీయటం లేదు. ఏడాది ఎంట్రీలోనే కరోనాతో కల్లోలం చేసింది. ఆ తర్వాత భారీ వర్షాలు, వరదలు. ఇప్పుడు తుఫాన్లు. 2021 సంవత్సరానికి గ్రాండ్ వెల్ కం చెబుతున్నట్లుగా.. బంగాళాఖాతం నుంచి విషాద వార్తలు వచ్చాయి.

డిసెంబర్ నెలలో రెండు తుఫాన్లు రాబోతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నివర్ తుఫాన్ తీరం దాటటంతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రజలకు ఇది షాకింగ్ న్యూస్. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సుడిగుండాలు.. క్రమంగా బలపడుతున్నాయి.

రాబోయే వారం రోజుల్లో ఇవి తుఫాన్లుగా మారే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. మధ్య, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ రెండు కూడా.. నివర్ తుఫాన్ కారణంగా ఏర్పడ్డాయని చెబుతున్నారు.

వారం రోజుల్లో వీటి దిశ ఎటువైపు ఉంటుంది.. ఏ విధంగా బలపడుతుంది అనేది స్పష్టం కానుంది. వాతావరణంలో మార్పులు వస్తే బలహీనపడొచ్చు అని కూడా చెబుతున్నారు అధికారులు. రాబోయే వారం రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఏపీ, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలు ఈ రెండు తుఫాన్లు వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

నివర్ తుఫాన్ నుంచి ఇంకా కోలుకోకముందే మరో రెండు తుఫాన్లు అని బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ వార్తతో అందరూ షాక్ అయ్యారు. 2020 సంవత్సరం ఏమీ మిగిల్చి వెళ్లేలా లేదు అని అంటున్నారు జనం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు