బాహుబలి లాంటి సినిమా అయినా టికెట్ రూ.5లే.. ప్రింటింగ్ మొదలుపెట్టిన ధియేటర్లు.. పార్కింగ్ ఫీజు కంటే టికెట్ ధరే తక్కువ

బాహుబలి లాంటి సినిమా అయినా టికెట్ రూ.5లే.. ప్రింటింగ్ మొదలుపెట్టిన ధియేటర్లు.. పార్కింగ్ ఫీజు కంటే టికెట్ ధరే తక్కువ

బాహుబలి లాంటి సినిమా అయినా టికెట్ రూ.5లే.. ప్రింటింగ్ మొదలుపెట్టిన ధియేటర్లు.. పార్కింగ్ ఫీజు కంటే టికెట్ ధరే తక్కువ

ఐదు రూపాయలు.. ఐదే ఐదు రూపాయలు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛాయ్ రాదు.. ఛాయ్ వరకు ఎందుకు.. ఐదు రూపాయలకు ఏమొస్తుంది అంటారు.. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇదే ఐదు రూపాయలతో సినిమా చూడొచ్చు.. 20 రూపాయలు ఉంటే.. భార్యభర్త ఇద్దరు పిల్లలతో సినిమా చూసేయొచ్చు..

ఓ ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలంటే వెయ్యి నోటు కావాలనే రోజుల నుంచి 20 రూపాయల నోటు ఉంటే చాలు అనే స్థాయికి తీసుకొచ్చారు సీఎం జగన్. ఇది అమ్మతోడుగా అక్షర సత్యం. సవరించిన సినిమా టికెట్ రేట్లు ఆధారంగా.. ఇప్పటికే చాలా ధియేటర్లు కొత్త రేట్లతో టికెట్లను ప్రింట్ చేశారు. గ్రామ పంచాయతీలోని ధియేటర్లలో కనీస టికెట్ 5 రూపాయలు టికెట్లను ముద్రించారు.

సినిమా అభిమానులు, ఫ్యామిలీలు హోదా మరిచి.. డబ్బు సేవ్ చేసుకోవాలి అంటే.. ఎక్కడ కూర్చున్నా అదే సినిమానే కదా అని అనుకుంటే మాత్రం.. ఐదు రూపాయలతో సినిమా చూసేయొచ్చు..

ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ ధర.. పార్కింగ్ ఫీజు కంటే తక్కువగా ఉంది. టికెట్ రేట్లు తగ్గించిన సీఎం జగన్ ప్రభుత్వం.. ధియేటర్లలో అమ్మే పాప్ కార్న్, టీ, కాఫీ, కూల్ డ్రింక్ రేట్ల విషయంలోనూ ఇదే విధమైన చర్యలు తీసుకుంటే.. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలతోపాటు ఆయా సినిమా హీరోల అభిమానులు ఒకటికి నాలుగు సార్లు ధియేటర్లలో సినిమా చూసే అవకాశం వస్తుంది.

ఒక్క ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలంటే వెయ్యి నోటు అయిపోవాల్సింది.. ఇక నుంచి ధియేటర్ వైపు సరదాగా అడుగులు వేయొచ్చు.. జస్ట్ 5 రూపాయలు మీ జేబులో ఉంటే చాలు.. మూడు గంటల ఎంటర్ టైన్ మెంట్..

జగన్ రాజ్యంలో.. సినిమాలకు రామ రాజ్యంలోని టికెట్ ధరలు వచ్చాయంటూ సెటైర్లు వేస్తున్నారు జనం..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు