డబ్బులు తీసుకోమన్నా వ్యాక్సిన్ కంపెనీలు తీసుకోవటం లేదు : సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

అన్న తిరుపతి వస్తున్నాడు.. ప్రచారానికి సీఎం జగన్.. షాక్ అయిన నేతలు.. కారణాలు ఇదే..

ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సిన్ ప్రక్రియపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేయటంతోపాటు.. ప్రజలకు వాస్తవ పరిస్థితిని వివరించారు. వ్యాక్సిన్స్ కోసం 1600 కోట్లు కర్చువుతుందని ప్రతిపక్షాలు అంటున్నాయని.. అంతే కాదు.. అంతకు మించి ఖర్చు చేసి ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

దేశంలో రెండే రెండు కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేశాయని.. డబ్బులు ఇస్తామన్నా వ్యాక్సిన్ కంపెనీలు తీసుకోవటం లేదని.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఇస్తామని.. నేరుగా రాష్ట్రాలకు ఇవ్వం అని చెబుతున్నాయని వివరించారు. వ్యాక్సిన్ కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం.. వాస్తవ పరిస్థితి ప్రతిపక్షాలకు తెలుసు.. ముఖ్యంగా చంద్రబాబుki తెలుసు.. భారత్ బయోటెక్ కంపెనీ చంద్రబాబు బంధువుదే అని.. ఈనాడు రామోజీరావు కుమారుడి వియ్యంకుడిది అని వివరించారు.

వాస్తవ పరిస్థితులు అన్నీ తెలిసి కూడా.. ఈనాడు పత్రికలో వ్యాక్సిన్ పై తప్పుడు కథనాలు రాస్తున్నాయని.. రాష్ట్ర ప్రజల్లో అలజడి సృష్టించేందుకు.. గందరగోళం చేసేందుకు.. ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ఇలాంటి నీచానికి ఒడిగడుతున్నాయని వివరించారు. వ్యాక్సిన్ కంపెనీల నుంచి నేరుగా వ్యాక్సిన్ కొనుగోలు చేయటానికి 45 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినా తీసుకోలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులోనే అఫిడవిట్ దాఖలు చేసిందని.. రాష్ట్రాలు – ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా వ్యాక్సిన్ కేటాయింపులు ఉంటాయని చెప్పిందని.. ఈ క్రమంలోనే వ్యాక్సిన్లు అన్నీ కేంద్రానికి వెళుతున్నాయని.. వారు కేటాయించినవే రాష్ట్రానికి వస్తున్నాయని వెల్లడించారు సీఎం జగన్.

కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు తప్పుడు వార్తలు, కథనాలు రాస్తున్నాయని.. వాస్తవ పరిస్థితి వారికి స్పష్టంగా తెలిసినా.. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని వివరించారు సీఎం జగన్

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు