డేంజర్ లో ఉన్నాం.. వ్యాక్సిన్ ఇవ్వండి ప్లీజ్.. మోడీకి లేఖ రాసిన సీఎం జగన్

ap cm jagan and modi

ఏపీలో కరోనా కట్టడికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాం.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు, ప్రజలు తిరగటానికి అనుమతి ఇస్తూ.. మిగతా సమయం మొత్తం లాక్ డౌన్ విధిస్తూ.. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి.. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని చేస్తూ ఉన్నాం. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న క్రమంలో.. మూడో విడత వ్యాప్తి ఉండొచ్చు అని వైద్యులు, శాస్త్రవేత్తలు, ఎయిమ్స్ డాక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున కేటాయించాల్సిన అవసరం ఉందని.. ఏపీ రాష్ట్రానికి వ్యాక్సిన్ డోసుల్ని పెంచాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు సీఎం జగన్. రోజువారీ కేసుల సంఖ్య 20 వేలకు చేరిందని.. కరోనా కట్టడికి లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధించామని.. ప్రజలు సురక్షితంగా బతకటానికి వ్యాక్సిన్ ఎంతో అవసరం అన్నారు సీఎం జగన్. వెంటనే వ్యాక్సిన్ డోసుల సంఖ్యను పెంచాలని.. ఎన్ని వ్యాక్సిన్ డోసులు పంపించినా.. వాటిని అందరికీ సమర్థవంతంగా ఇవ్వటానికి కావాల్సిన వైద్య సిబ్బంది, వ్యవస్థ అంతా సిద్ధంగా ఉందని లేఖలో వివరించారు సీఎం జగన్.

వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి తక్కువగా వస్తున్నాయని.. కంపెనీల నుంచి రాష్ట్ర కోటాను పెంచాలని.. కేంద్రం ఇచ్చే కోటాను సైతం పెంచాలని కోరారు సీఎం జగన్.

మరి సీఎం జగన్ లేఖకు ప్రధానమంత్రి మోడీ స్పందించి.. వ్యాక్సిన్ డోసుల సరఫరాను పెంచుతారా లేదా చూడాలి.. ఎందుకంటే దేశంలోని అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇలాగే ఉంది.. అందరూ ఇలాగే డిమాండ్ చేస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు