విదేశీ కంపెనీల వ్యాక్సిన్లు తెచ్చుకుంటాం.. అనుమతి ఇవ్వండి :కేంద్రానికి సీఎం జగన్ లేఖ

ap cm jagan lettter to modi

లాభం లేదు.. ఇలా అయితే కరోనాతో అందరం చచ్చేలా ఉన్నాం.. 130 కోట్ల మంది జనానికి.. నెలకు 8 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అయితే.. అందరికీ వ్యాక్సిన్లు వేయాలంటే రెండేళ్లు పడుతుంది.. అప్పటి వరకు లాక్ డౌన్ పెట్టలేం.. అలా అని జనాన్ని చంపుతూ ఉండలేం.. వెంటనే పరిష్కార మార్గంగా ఆలోచించి ముందడుగు వేసింది ఏపీ ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వానికి.. ప్రధాని మోడీకి సంచలన లేఖ రాశారు సీఎం జగన్.

దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లు సంఖ్యను బట్టి.. రాష్ట్రానికి కేటాయింపులు చాలా తక్కువగా ఉంటున్నాయి. డిమాండ్ అత్యంత ఎక్కువగా ఉంది. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగల సామర్థ్యం మా దగ్గర ఉంది.. అందుకు తగ్గట్టు వ్యాక్సిన్ కంపెనీలు రాష్ట్రానికి ఇవ్వటం లేదు.. ఈ క్రమంలోనే మేం విదేశీ కంపెనీల నుంచి వ్యాక్సిన్లు తెచ్చుకోవటానికి అనుమతి ఇవ్వండి.. గ్లోబల్ టెండర్లు ద్వారా వ్యాక్సిన్ తెచ్చుకోవటానికి అనుమతి ఇవ్వండి.. ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు.. రెండు డోసులు ఇవ్వటానికి అవసరం అయిన 16 వందల కోట్లు ఖర్చు చేయటానికి సిద్ధంగా ఉన్నాం.. కాకపోతే విదేశీ వ్యాక్సిన్లు తెచ్చుకోవటానికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాశారు సీఎం జగన్.

రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్లలోపు వారికి ఇంకా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించలేదు.. 45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోసు వ్యాక్సిన్ ఇవ్వటానికి అవసరమైన వ్యాక్సిన్లు లేవు.. ఇన్ని ఇబ్బందుల మధ్య.. దేశీయ వ్యాక్సిన్లు మాత్రమే వేయాలి అంటే.. మరో రెండేళ్లు పడుతుంది.. ఆలోపు మరిన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కోనే అవకాశాలు ఉన్నాయి. ఈక్రమంలోనే విదేశీ కంపెనీల వ్యాక్సిన్లకు సైతం అనుమతి ఇవ్వాలని ప్రధాని మోడీతోపాటు కేంద్ర ఆరోగ్య శాఖ, అనుమతి ఇవ్వాల్సిన శాఖలకు లేఖలు రాశారు సీఎం జగన్.

ఇప్పటికే అమెరికాకు చెందిన ఫైజర్, ఆస్ట్రాజనకా, మొడెర్నా వ్యాక్సిన్లు ఎంతో సమర్థవంతంగా పని చేస్తున్నాయని ఆయా దేశాలు ప్రకటించాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని.. భారతీయ, ఏపీ రాష్ట్ర అవసరాలను గుర్తించి.. సాధ్యాసాద్యాలను పరిశీలించి అనుమతి ఇవ్వాలంటూ లేఖ రాశారు సీఎం జగన్.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు, నిర్ణయాలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ.. ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు