ఆ వర్గం మీడియాకు షాక్ ఇచ్చిన నీలం సాహ్నీ- ప్రతిపక్షాలు క్లీన్ బౌల్డ్

గత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రెస్ మీట్ కు విరుద్ధంగా.. భిన్నంగా సాగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్ నీలం సాహ్ని ప్రెస్ మీట్

నిమ్మగడ్డకు భిన్నంగా నీలం సాహ్ని ప్రెస్ మీట్ - ప్రతిపక్షాలు క్లీన్ బౌల్డ్

గత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రెస్ మీట్ కు విరుద్ధంగా.. భిన్నంగా సాగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్ నీలం సాహ్ని ప్రెస్ మీట్. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత.. ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడారు. గతంలో నిమ్మగడ్డ తాను చెప్పాలనుకున్నది చెప్పేసి.. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయే వారు. అందుకు భిన్నంగా ఇప్పుడు నీలం సాహ్ని మాత్రం తాను చెప్పాలనుకున్నది చెప్పి.. మీడియా ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగారు. కమిషనర్ నీలంసాహ్నిపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో వచ్చిన ఓ వర్గం మీడియా.. ఈ పరిణామంతో షాక్ అయ్యింది.

ఆ వర్గం మీడియాకు షాక్ ఇచ్చిన నీలం సాహ్నీ- ప్రతిపక్షాలు క్లీన్ బౌల్డ్

  1. ఈ ఎన్నికలు కొత్తగా.. మొదటి నుంచి జరుగుతున్నవి కాదు. మధ్యలో ఆగిపోయినవి. గత ఎన్నికల నోటిఫికేషన్ మాత్రమే కొనసాగిస్తున్నాం. ఇందులో కొత్తగా నిర్ణయం తీసుకున్నది ఏమీ లేదు
  2. జెడ్పీటీసీ, ఎంపిటీసీ ఏకగ్రీవాలు ప్రకటించాలని రెండు నెలల క్రితమే హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు ఏకగ్రీవాల పత్రాలు అందించటం జరిగింది.
  3. ఏకగ్రీవాలకు హైకోర్టు ఆదేశించింది అంటే.. ఎన్నికల ప్రక్రియ కొనసాగించమని చెప్పినట్లే కదా.. ఏకగ్రీవాలు రద్దు చేయాలి అన్నప్పుడే కొత్తగా నిర్వహించాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి సమస్యే తలెత్తదు.
  4. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉంది. ఇదే సమయంలో దేశంలో, రాష్ట్రంలో తిరుపతి ఉప ఎన్నిక జరుగుతుంది. పనిలో పనిగా ఈ ఎన్నికలను కూడా పూర్తి చేసినట్లయితే.. వ్యాక్సిన్ పై దృష్టి పెట్టొచ్చు.
  5. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతోపాటు ఉద్యోగులు, వైద్య, ఆరోగ్య శాఖ కూడా అంగీకరించింది.
  6. పది రోజుల్లో ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత గ్రామస్థాయిలో వ్యాక్సిన్ ను వేగవంతం చేయటానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులపై ఒత్తిడి, భారం తగ్గుతుంది.
  7. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కమిషనర్ గా ఉన్నప్పుడే బ్యాలెట్ పేపర్లు కూడా సిద్ధం అయ్యాయి.. ఇప్పుడు కొత్తగా బ్యాలెట్ పేపర్లు ముద్రించాల్సిన అవసరం లేదు.
  8. అభ్యర్థులు చనిపోయిన చోట.. తర్వాత ఎన్నికలు నిర్వహిస్తాం. అవి తక్కువగానే ఉన్నాయి.

ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇంత క్లియర్ ఉండటంతో.. ప్రతిపక్షాలకు సైతం ఏం చేయాలో అర్థం కావటం లేదు. బ్యాలెట్ పేపర్లు కూడా ముద్రించి ఉన్న సమయంలో ఆగిన ఎన్నికలను మొదటి నుంచి ఎలా కొనసాగించాలని డిమాండ్ చేస్తాం అంటున్నారు.

ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అంటే ప్రత్యేక వర్గం మీడియా సైతం నోరెత్తలేదు.. దీంతో మీడియా సమావేశం ముగించి వెళ్లిపోయారు నీలం సాహ్ని.

See also : దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా – కొత్త కేసులు ఎన్నంటే…?

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు