దేశం మొత్తానికి ఆక్సిజన్ ఇస్తున్న ఏపీ – జగన్ ముందుచూపు ఇప్పుడు ప్రాణాలు కాపాడుతుంది

దేశం మొత్తానికి ఆక్సిజన్ ఇస్తున్న ఏపీ - జగన్ ముందుచూపు ఇప్పుడు ప్రాణాలు కాపాడుతుంది

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో.. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విలయతాండం చేస్తున్న సమయంలో.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మహారాష్ట్రలో అయితే ఆక్సిజన్ కొరత వల్ల 10 మంది కరోనా రోగులు చనిపోయారు. మామూలు రోజుల కంటే.. వెయ్యి రెట్ల డిమాండ్ ఒక్కసారిగా పెరగటంతో.. డిమాండ్ కు తగ్గట్టు సప్లయ్ లేక.. ఆక్సిజన్ అందక కరోనా పేషంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు.

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతను తీరుస్తున్న ఏ రాష్ట్రమో తెలుసా.. ఆంధ్రప్రదేశ్. అవును.. ఏడాది క్రితం లాక్ డౌన్ సందర్భంగా ఆక్సిజన్ సిలిండర్ల కొరతను దృష్టిలో ఉంచుకుని.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ఏపీలోని విశాఖపట్నంలో 100 టన్నుల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ యూనిట్ ప్లాంట్ ను నిర్మించింది ప్రభుత్వం. ఇంత పెద్ద ప్లాంట్ పెట్టినా.. ప్రభుత్వం ఎక్కడా చెప్పుకోలేదు.. ప్రచారం చేసుకోలేదు.. కనీసం ప్రజలకు కూడా తెలియదు.

ప్రస్తుతం విశాఖలోని ఈ ఆక్సిజన్ యూనిట్ నుంచి మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఆక్సిజన్ సిలిండర్ల సప్లయ్ అవుతుంది. ఇప్పటి వరకు నాగపూర్ కు 40 టన్నుల ఆక్సిజన్ సిలిండర్లు తరలించింది. మిగతా రాష్ట్రాలకు 10 టన్నుల ఆక్సిజన్ పంపించింది. రోజుకు 100 టన్నుల సామర్థ్యం ఉండగా.. రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. మిగతాది ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ.. ప్రాణం పోస్తుంది ఏపీ సర్కార్.

ప్రస్తుతం ఏపీలోనూ రోజువారీ కేసుల సంఖ్య 5 వేలకు చేరుకోవటంతో.. అప్రమత్తం అయిన సర్కార్.. ఆక్సిజన్ ప్లాంట్ ను పూర్తి స్థాయిలో.. మూడు షిఫ్టుల్లో నడిచేలా సిబ్బంది, ఉద్యోగులను సన్నద్ధం చేస్తుంది. మొదటి ప్రాధాన్యతగా రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత.. మిగతాది అంతా ఇతర రాష్ట్రాలకు తరలించాలని.. అవసరం అయితే సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించింది ప్రభుత్వం.

మిగతా అన్ని రాష్ట్రాలు ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ఏ రాష్ట్రం కూడా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోలేదు. ఏపీ సీఎం జగన్ ఒక్కరే.. రాబోయే ప్రమాదాన్ని, అవసరాలను గుర్తించి.. అత్యవసరంగా రోజుకు 100 టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్ సిలిండర్ల ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్నారని కేంద్రం మిగతా రాష్ట్రాలకు చురకలు అంటించే వరకు.. ఈ విషయంలో వెలుగులోకి రాలేదు.

ఒక్క ఆక్సిజన్ ప్లాంట్ విషయంలోనే కాకుండా.. మాస్క్ లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లను సైతం రాష్ట్రంలో ఉత్పత్తిని పెంచి.. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి వచ్చాయి ప్లాంట్లు. కరోనాను ఎదుర్కోవటానికి అవసరం అయిన సామాగ్రి అంతా.. ఏపీలోనే తయారు అవుతుందని.. ఈ విషయాన్ని ఎప్పుడు ప్రకటనలు, భజనతో చెప్పుకోలేదని అంటున్నారు ప్రభుత్వ అధికారులు.

See also :  యూట్యూబ్ లో చూసి సర్పదోషం పేరుతో కూతురి గొంతు కోసిన ప్రైవేట్ టీచర్

See also : బతకాలో చావాలో డెసిషన్ మీదే : హైదరాబాద్ లో కరోనా బెడ్స్ లేవు : ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజుకు లక్ష

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు