ఏపీలో భారీగా పెరిగిన ఉద్యోగుల జీతాలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యకళాశాలల్లో పనిచేస్తున్న బోధన వైద్యులకు భారీగా జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు మార్చి 1 నుంచి అమలులోకి వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 4 వేలమంది వైద్యాలకు లబ్ది చేకూరనుంది. అకడమిక్‌ లెవెల్, సీనియార్టీని బట్టి వేతనాల పెంపు నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

వీరి జీతాలను 7వ సెంట్రల్‌ పే కమిషన్‌ ఫార్ములా ప్రకారం వేతనాలను పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకున్న వేతన సవరణ నిర్ణయంతో వేతనాలు భారీగా పెరిగాయి. ఉదాహరణకు 2006 పే స్కేల్ ప్రకారం ప్రొఫెసర్ కు రూ. 37,400-రూ.67 వేల వరకు వేతనాలు ఉండగా..తాజాగా సవరించిన పే స్కేల్ ప్రకారం వీరి వేతనం రూ. 1,44,200-రూ.2,18,200 వరకు పెరగనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు బోధన వైద్యులు. ఇదిలా ఉంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2006లో వీరి జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

తిరిగి 15 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బోధన వైద్యుల జీతాలను పెంచారు. రాష్ట్రంలో మొత్తం 2 డెంటల్ కళాశాలలు, 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ట్యూటర్‌ నుంచి ప్రొఫెసర్‌ వరకు వివిధ స్థాయిల్లో దాదాపు 4 వేల మంది పని చేస్తున్నారు.

ఏపీలో భారీగా పెరిగిన ఉద్యోగుల జీతాలు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు