పరీక్షల నిర్వహణపై మరోసారి ఆలోచించండి.. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. టీడీపీ పిటీషన్లపై విచారణ

ap high cour over exams

ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లటం ఏంటని.. మిగతా చాలా రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేశారు కదా అని ప్రశ్నించింది ఏపీ హైకోర్టు. మే 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో పరీక్షలు వాయిదా వేయాలంటూ తెలుగుదేశం పార్టీ తరపున కొన్ని పిటీషన్లు దాఖలు అయ్యాయి. టీడీపీతోపాటు కేఏ పాల్ సైతం పరీక్షలు వాయిదా వేస్తూ పిటీషన్లు దాఖలు చేశారు.

అన్ని పిటీషన్లను విచారించిన ఏపీ హైకోర్టు.. పరీక్షల నిర్వహణ వల్ల కరోనా వస్తుందనే భయం తల్లిదండ్రుల్లో ఉందని.. అలాంటప్పుడు మొండిగా ముందుకెళ్లటం.. పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరింది ఏపీ హైకోర్టు. విద్యార్థుల ప్రాణాలు ఎంతో ముఖ్యం అని వ్యాఖ్యానించింది. చాలా రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేశాయని.. మీరెలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయమని వ్యాఖ్యానించింది హైకోర్టు.

దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కరోనాతో ఉన్న విద్యార్థులకు వేరుగా పరీక్ష నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నామని వివరణ ఇచ్చింది. కోవిడ్ వల్ల పరీక్ష రాయలేని వారికి మరో అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసింది. పిటీషన్లు – ప్రభుత్వ వాదనలను విన్న హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. మే 3వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు