షాక్ అయిన టీడీపీ : ధూళిపాళ్ల నరేంద్రకు ఎదురుదెబ్బ.. విచారణ చేయాల్సిందే అని హైకోర్టు ఆదేశం

ap high court rules out dhulipalla narendra kumar case

గుంటూరు జిల్లా తెనాలిలోని సంగం డెయిరీలో అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా ఫోర్జరీ సంతకాలతో బ్యాంక్ నుంచి 200 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవటం.. డెయిరీ భూములను సొంత ట్రస్ట్ కు మళ్లించటంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.

ఏసీబీ కేసులు, విచారణను నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు ధూళిపాళ్ల నరేంద్ర. సంగం డెయిరీపై గతంలోనే కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయని.. ఏసీబీ కానీ, ప్రభుత్వం కానీ విచారణ ఎలా చేస్తుందని.. అసలు ప్రభుత్వానికే సంబంధం లేదంటూ ధూళిపాళ్ల వాదిస్తున్నారు.

ఏసీబీ కేసులను పరిశీలించిన ఏపీ హైకోర్టు.. ధూళిపాళ్ల దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ కొట్టివేసింది. విచారణ కొనసాగించటానికే అనుమతి ఇచ్చింది. విచారణ జరగకూడదని ఎలా వాదిస్తారంటూ ధూళిపాళ్లను ప్రశ్నించింది ఏపీ హైకోర్టు. విచారణలో నేరారోపణలు నిరూపితం అవుతాయా లేదా అనే విషయం తేలాల్సి ఉందని.. అసలు విచారణే జరగకూడదని అనటం ఏంటని ప్రశ్నించింది. ఏసీబీ విచారణకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. ధూళిపాళ్ల పిటీషన్ కొట్టివేసింది.

ఏపీ హైకోర్టు ఆదేశాలతో టీడీపీ పార్టీ, శ్రేణులు షాక్ అయ్యాయి. గతంలో రమేశ్ ఆస్పత్రిలో 10 మంది సజీవ దహనం అయినా.. మాజీ మంత్రి అచ్చెంనాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ కేసుల్లో లాగే అనుకూలంగా తీర్పు వస్తుందని భావించారు టీడీపీ శ్రేణులు. అందుకు తగ్గట్టుగానే అక్రమ అరెస్టులు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఏపీ హైకోర్టు మాత్రం.. విచారణ కొనసాగించాల్సిందే అంటూ ఏసీబీకి అనుమతి ఇచ్చింది. ధూళిపాళ్ల పిటీషన్లు కొట్టి వేసింది. దీంతో షాక్ అయ్యారు టీడీపీ నేతలు, కార్యకర్తలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు