కేసులన్ని గెలిచిన నిమ్మగడ్డ – మొదటి కేసే ఓడిపోయిన నీలం సాహ్నీ

నిమ్మగడ్డ రమేశ్ గెలిస్తే.. నీలం సాహ్ని ఓడిపోయారా?

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం – ప్రభుత్వం – హైకోర్టు మధ్య ఏడాదిగా జరుగుతున్న కేసుల విషయంలో.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గెలుస్తూ వస్తే.. కొత్త సీఎస్ నీలంసాహ్ని మాత్రం.. బాధ్యతలు స్వీకరించిన వెంటనే విడుదల చేసిన కొనసాగింపు షెడ్యూల్ పై ఎదురుదెబ్బ తిన్నారు. అప్పట్లో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు కోర్టుల ద్వారా న్యాయం జరిగింది. ఎస్ఈసీ నోటిఫికేషన్, షెడ్యూల్ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోం అంటూ పదేపదే కోర్టులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని.. నిబంధనల ప్రకారమే నడుచుకుంటుందని.. హైకోర్టు కూడా జోక్యం చేసుకోలేదని.. హైకోర్టుకు ఎంత అధికారం ఉంటుందో.. ఎన్నికల సంఘానికి కూడా అంతే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విజయం సాధిస్తూ వస్తే.. కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఎదురుదెబ్బ తగిలింది. నీలంసాహ్ని కొత్తగా నోటిఫికేషన్, షెడ్యూల్ ఇవ్వలేదు. కేవలం గత కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ మధ్యలో ఆపేసిన ఎన్నికలను కొనసాగింపునకు మాత్రమే షెడ్యూల్ ఇచ్చారు.

ఇక నీలంసాహ్ని షెడ్యూల్ విడుదల సమయంలోనే ఓ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది కొత్తది కాదు.. కేవలం కొనసాగింపు మాత్రమే అని. ఎక్కడ అయితే జెడ్పీ ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచే కొనసాగిస్తున్నాం అని వెల్లడించారు. కొత్త నోఫిటికేషన్ దాఖలు చేసే సమయంలోనే.. 4 వారాల గడువు ఉండాల్సి ఉంటుందని.. ఇందులో అలాంటి ప్రశ్నలు తలెత్తవని వివరించారు. ఏకగ్రీవాలకు సైతం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు.. కొత్త నోటిఫికేషన్ ఎలా అవుతుంది అనేది ఇప్పుడు హైకోర్టు తీర్పు తర్వాత అందరికీ వస్తున్న డౌట్..

కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చినప్పుడు.. అసలు నాలుగు వారాల గడువు అనే కోడ్ ఎలా ఉంటుందనేది బేసిక్ క్వశ్చన్ అతి సామాన్యులకు కూడా వస్తుంది.

See also : ప్రజాక్షేత్రంలో ఓడిపోయినా.. కోర్టులో గెలుస్తాం – మీడియా సాక్షిగా వెల్లడించిన చంద్రబాబు

See Also : జగన్ బెయిల్ రద్దు పిటీషన్ సరే.. ఎగ్గొట్టిన రూ.273 కోట్లపై విచారణకు రండీ : రఘురామకృష్ణంరాజుకు సీబీఐ షాక్

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు