ఆగదు.. ఆగబోదు.. ఏపీలో ఇంటర్ పరీక్షలపై క్లారిటీ.. ఏర్పాట్లు షురూ చేసిన అధికారులు

ap 10th exams getting ready

ఏపీలో ఇంటర్ పరీక్షల అంశంపై రాజకీయ దుమారం జరుగుతున్న సమయంలోనే.. ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది. మే 5వ తేదీ నుంచి జరిగే ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని.. ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని విద్యార్థులకు సూచించింది సర్కార్. ఇందుకు సంబంధించి విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని.. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.

కరోనా నిబంధనలను పాటిస్తూ.. పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ వివరించారు. ప్రతి పరీక్ష హాలును పూర్తిగా శానిటైజ్ చేయటంతోపాటు.. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే ముందే ధర్మల్ స్క్రీనింగ్, జ్వరం, దగ్గు, జలుబు వంటి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఎవరైనా కరోనాతో స్వల్ప లక్షణాలతోపాటు బాధపడుతున్నట్లయితే అలాంటి స్టూడెంట్స్ కోసం ప్రత్యేకమైన గదులు ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు.

పరీక్షకు హాజరయ్యే ప్రతి స్టూడెంట్ మధ్య కరోనా నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటించటం జరుగుతుందన్నారు. ఇంటర్, టెన్త్ పరీక్షలపై కేఏ పాల్ తోపాటు ఇతరులు కోర్టుకు వెళ్లిన విషయంపై మంత్రి స్పందించారు. పరీక్షలు నిర్వహించటానికే ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం అన్నారు. కరోనా జాగ్రత్తలు, పరీక్షల నిర్వహణపై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని వివరాలు వివరిస్తామని స్పష్టం చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు