ఒక్కో స్టూడెంట్ ఖాతాలో రూ.10 వేలు.. పండగ చేసుకుంటున్న కుర్రోళ్లు..

ap school students

ఏపీలో స్టూడెంట్స్ ఖాతాలో డబ్బులు పడ్డాయి. జగనన్న విద్యా దీవెన కింద.. ఒక్కో స్టూడెంట్ తల్లి ఖాతాలో 10 వేల రూపాయలు జమ అయ్యాయి. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం.. ఈ డబ్బును ఆన్ లైన్ ద్వారా స్టూడెంట్స్ ఖాతాలోకి నేరుగా జమ అయ్యాయి. డబ్బులు పడినట్లు మెసేజ్ లు వస్తుండటంతో.. స్టూడెంట్స్ ఖుషీ అవుతున్నారు. అసలే కరోనా టైం.. డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న పేరంట్స్ కు ఇది పెద్ద ఊరటగా ఉంది.

10 లక్షల 88 వేల 439 మంది స్టూడెంట్స్ కు.. 671 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏపీ సర్కార్. సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కటం ద్వారా.. వారి వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ డబ్బుల రాకతో ప్రైవేట్ కాజీలు సైతం హ్యాపీగా ఉన్నాయి. ఫీజులు రాబట్టుకోవటంతోపాటు.. ప్రైవేట్ టీచర్లకు, ప్రొఫెసర్లకు జీతాలు చెల్లింపునకు మార్గం సుగుమం అయ్యింది.

బీసీ సంక్షేమ శాఖ ద్వారా 491 కోట్లు.. ఎస్సీ విద్యార్థులకు 119 కోట్లు.. ఎస్టీ విద్యార్థుల కోసం 19 కోట్లు.. మైనార్టీ విద్యార్థుల కోసం 41 కోట్లు చొప్పున నిధుల విడుదల అయ్యాయి.

ఫీజు రీయింబర్స్ మెంట్ కింద గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో పెండింగ్ లో ఉన్న వెయ్యి 174 కోట్ల రూపాయలను సైతం విడుదల చేసింది ప్రభుత్వం. మొత్తంగా చూస్తే ఫీ రియింబర్స్ మెంట్ కింద 4 వేల 207 కోట్ల రూపాయలను స్టూడెంట్స్ తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసింది సీఎం జగన్ ప్రభుత్వం.

స్టూడెంట్స్ ఎవరికైనా డబ్బులు పడలేదు అంటే ఆందోళన చెందాల్సిన పని లేదు.. 1902 నెంబర్ కు కాల్ చేస్తే ఎందుకు రాలేదు.. డబ్బులు రావాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని స్పష్టం చెబుతారు. వారి ఖాతాల్లో రెండు వారాల్లో ఆ డబ్బులు జమ చేస్తోంది ప్రభుత్వం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు