ఆ 2 గంటల్లో నాలుగు లక్షల మంది వెళ్లిపోయారు.. ముందస్తుగా భయపడిపోయిన జనం

ఆ 2 గంటల్లో నాలుగు లక్షల మంది వెళ్లిపోయారు.. ముందస్తుగా భయపడిపోయిన జనం

ap telangana border
ap telangana border

తెలంగాణలో ఉన్నట్టుండి.. ముందస్తు సమాచారం లేకుండా.. అప్పటికప్పుడు లాక్ డౌన్ ప్రకటించటంతో షాక్ అయ్యారు హైదరాబాదీలు. ముఖ్యంగా ఏపీకి చెందిన ప్రజలు హడావిడి పడ్డారు. ఏపీలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రం సాధారణ ప్రజలకు ఎంట్రీ ఉండటంతో.. అందుకు తగ్గట్టుగానే ప్లానింగ్ చేసుకున్నారు ఏపీకి చెందిన హైదరాబాదీలు.

అర్థరాత్రి 12 గంటల నుంచి హైదరాబాద్ కు చెందిన వేలాది మంది సొంత వాహనాల్లో ఏపీ సరిహద్దులకు బయలుదేరారు. ఉదయం 6 గంటల కల్లా ఏపీ సరిహద్దుల్లోకి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో.. యమ స్పీడ్ గా వెళ్లిపోయారు. అనుకున్నట్లుగానే విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అనూహ్యంగా పెరిగింది. జగ్గయ్యపేట దగ్గర ఉదయం 6 గంటలకు రెండు కిలోమీటర్ల దూరం వరకు కార్లు ఆగిపోయాయి. నల్గొండ – ఏపీ బోర్డర్  దాచేపల్లి దగ్గర రెండు కిలోమీటర్ల కార్ల క్యూ ఉంది. ఇక కర్నూలు హైవేలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఆరు గంగలకు సరిహద్దుల్లో చెక్ పోస్టు ఓపెన్ చేయటంతో.. తమ గమ్యస్థానాలకు 12 గంటల్లోపు వెళ్లిపోవాలనే ఉద్దేశంతో చాలా స్పీడ్ కార్లు వెళ్లటం కనిపించింది. 12 దాటితే పాసులు, చెక్ పోస్టుల దగ్గర పోలీసుల హడావిడి ఎందుకు అన్న ఉద్దేశంతో చాలా మంది వాహనదారులు కనీసం టీ, టిఫిన్ కోసం సైతం ఆగలేదు.

హైదరాబాద్ లో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత.. ఉదయం ఆరు నుంచి 8 గంటల మధ్య తెలంగాణ నుంచి ఏపీ సరిహద్దుల్లోకి అక్షరాల నాలుగు లక్షల మంది ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు 12 వేల ప్రైవేట్ వాహనాలు ఏపీకి ప్రవేశించాయని ఓ లెక్క. తెలంగాణలో లాక్ డౌన్ 10 రోజులే అయినా.. పొడిగింపు ఉండొచ్చన్న ఉద్దేశం అందరిలో నెలకొంది. ఈ క్రమంలోనే చాలా మంది వెళ్లిపోయారు. కార్లు, బైక్స్ లేనివాళ్లు.. తెలంగాణ సరిహద్దులకు వరకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి.. అక్కడి నుంచి ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సుల్లో వెళ్లిపోయారు.

మొత్తంగా.. మే 12వ తేదీ ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య.. ఆ రెండు గంటల్లో నాలుగు లక్షల మంది తెలంగాణ నుంచి ఏపీలోకి వెళ్లిపోయారు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు