సీఎం జగన్ దూకుడు – ఏప్రిల్ 8న పరిషత్ ఎన్నికలు, 10న కౌంటింగ్

సీఎం జగన్ దూకుడు - ఏప్రిల్ 8న పరిషత్ ఎన్నికలు, 10న కౌంటింగ్

ఏపీ ప్రభుత్వం ఎన్నికలపై దూకుడుగా ఉంది. నిమ్మగడ్డ పదవీ కాలం అలా ముగుస్తుందో లేదో.. కొత్త కమిషనర్ గా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే.. తొలి సంతకం పరిషత్ ఎన్నికల షెడ్యూల్ పై పెట్టనుంది. ఏప్రిల్ ఒకటో తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మిగిలిన ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయనున్నారు.

కేవలం ఏడు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉండటంతో.. దానికి సంబంధించి మాత్రమే కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు.ఏప్రిల్ 8వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల జరగనున్నాయి. ఏప్రిల్ 10వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి చేయాలని.. నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇప్పటికే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కోరింది ప్రభుత్వం. అయితే అందుకు ఆయన నిరాకరించారు. నా హయాంలో నిలిపివేసిన ఎన్నికలను పూర్తి చేయలేను అని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కొత్తగా ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న నీలం సాహ్ని.. ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

నాలుగు రోజుల క్రితమే ఏప్రిల్ 10న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అంటూ షుగర్లీ ముందుగానే స్పష్టం చేసిన విషయం తెలిసిందే..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు